Budida Bikshamaiah Goud : ఆ ‘గౌడ్’ ఇళ్లకు..ఈ ‘గౌడ్’ అళ్లకు
Latest News Telangana

Budida Bikshamaiah Goud : ఆ ‘గౌడ్’ ఇళ్లకు..ఈ ‘గౌడ్’ అళ్లకు

Budida Bikshamaiah Goud : భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేరికతో మంచి జోష్ లో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ కలిగింది. ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్(Budida Bikshamaiah Goud) బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా వెల్లడించారు.

Image

బిక్షమయ్య గౌడ్ ఈ ఏడాది ఏప్రిల్ లోనే బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కానీ కొద్దినెలల్లోనే పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2009లో కాంగ్రెస్ తరుపున ఆలేరు నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 మార్చి 26 న- టీఆర్ఎస్ లో చేరారు. ఆ తరవాత 2022 ఏప్రిల్ లో బీజేపీలో చేరారు. ఇప్పడు మళ్లీ టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు.

Also Read :