BJP vs RSS : తెలంగాణలో కాషాయ జెండాల మధ్య కయ్యం… నిజమేనా..?
Latest Telangana

BJP vs RSS : తెలంగాణలో కాషాయ జెండాల మధ్య కయ్యం… నిజమేనా..?

BJP vs RSS in Telangana : తెలంగాణలో బీజేపీ జోరు చూపిస్తోంది. ఈటల రాజేందర్ చేరిక తర్వాత బీజేపీ నాయకత్వంలో, శ్రేణుల్లో మరింత జోష్ కనిపిస్తోంది. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు తమదేనని చెబుతున్నారు.

అయితే.. గెలుపుపై ధీమాతో ముందుకెళ్తున్న కమలనాథులకు ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడిందట. క్రమశిక్షణకు  మారుపేరని చెప్పుకునే పార్టీలో.. ఇప్పుడు ఆ క్రమశిక్షణ నేర్పే వాళ్లతోనే సమస్య వచ్చిందట. రాష్ట్రంలో bjp, వర్సెస్ RSS వార్ నడుస్తోందట.

సంఘ్ ప్రతినిధులు, బీజేపీ నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదట. సంఘ్ ప్రతినిధుల తీరు పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారిందని నేతలంటున్నారు. సంఘ్ ప్రతినిధులను ఏమైనా అంటే అధినాయకత్వం సీరియస్ అవుతుందనే భయంతో బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదు. దీంతో సంఘ్ ప్రతినిధులు, బీజేపీనేతల(BJP vs RSS in Telangana) మధ్య గ్యాప్ పెరుగుతోందనే మాట వినిపిస్తోంది.

ప్రతీ రాష్ట్ర బీజేపీ శాఖలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుంటారు. వీరికి పార్టీలో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా వీరు తెరవెనక రాజకీయాలు మాత్రమే చేస్తారు. నేతల పనితీరు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కేంద్ర నాయకత్వానికి సమాచారం ఇస్తుంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే వీరు పని.

bjp vs rss

పదవులతో ముదిరిన కయ్యం

కానీ ఇప్పుడు.. వీరు తమ పనితో పాటు.. పార్టీ నాయకులు చేయాల్సిన పనుల్లోనూ వేలు పెడుతున్నారట. పార్టీలో ఎవరి పని వారు చేయాలి. కానీ అలా కాకుండా తమ కూడా RSS ప్రతినిధులే చేస్తుండటంపై  నేతలు గుర్రుగా ఉన్నారట. నేతలకు పదవుల విషయంలోనూ వీరి జోక్యం ఎక్కువవుతోందని అసంతృప్తితో ఉన్నారట.

పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారికి పదవులు ఇస్తుంటారు. దీనికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇటీవల బీజేపీ జాతీయ యువమోర్చాలో  తెలంగాణకు రెండు పదవులు వచ్చాయి. ఈ పదవుల విషయంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చక్రం తిప్పారనే మాట వినిపిస్తోంది.

రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించకుండానే  ఓ వ్యక్తికి పార్టీలో పదవి ఇప్పించారని ఇక్కడి నేతలు గుర్రుగా ఉన్నారట. దీనికి తోడు.. ఇటీవల కొందరు బీజేపీని వీడటం కూడా.. అంతర్గత కుమ్ములాటల కారణంగానే జరిగిందని బీజేపీ వర్గాలంటున్నాయి.

రాష్ట్రంలో సంఘ్, బీజేపీ నేతల మధ్య గ్యాప్ ఉన్న విషయాన్ని పార్టీ అధినాయకత్వం కూడా గుర్తించిందట. అందుకే ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ముఖ్య నేతలు.. స్టేట్ లీడర్స్ కి క్లాప్ పీకి వెళ్లారట. కలిసిమెలిసి ఉంటేనే మంచిది..లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్లారట.

Read Also :