Telangana

BJP Plan : తెల్లారే సరికి కోటీశ్వరులైతున్నరు..!?

BJP plan in munugodu bypoll : రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. సిట్టింగ్ సీట్ కోసం కాంగ్రెస్, పార్టీ మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు  బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.  తమ పాత సీటును చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటరు ఎవరి వైపు ఉంటారనేది ఎవరికి అంతుపట్టడం లేదు.

అయితే.. ఓటరు నాడికంటే కూడా ఇక్కడ మరో అంశం ఆసక్తికరంగా మారింది. మునుగోడు బైపోల్ ను అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్ గానే భావిస్తున్నాయి పార్టీలు. తెలంగాణలో పాగా వేయాలనే కసితో ఉన్న బీజేపీ(bjp plan) ఏది ఏమైనా మునుగోడులో గెలవాలని చూస్తోంది.

మామూలుగా ఎన్నికలొస్తే ఎక్కడైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. కానీ మునుగోడులో మాత్రం డిఫరెంట్ ట్రెండ్ నడుస్తోంది. ఓటర్ల కంటే ముందు లీడర్లను కొనే  పనిలో బీజేపీ లీడర్లు ఫుల్ బిజీగా ఉన్నారట.

వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు రేటు కడుతోందనే ప్రచారం బహిరంగంగానే జరుగుతోంది. ఒక్కొక్కరికి కోటి నుంచి రెండు కోట్ల వరకు ముట్టజెప్పుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఖర్చు భారీగా పెట్టాలి కాబట్టే అక్కడ ఎన్నికల బాధ్యతలు కూడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టారట. ఈటల రాజేందర్, వివేక్, జితేందర్ రెడ్డి.. ఇలా అందరూ ఆర్థికంగా బలంగా ఉన్ననేతలకే మునుగోడు బాధ్యతలు అప్పజెప్పింది బీజేపీ. ఎలాగూ బీజేపీ(bjp plan) అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా ఉన్న వ్యక్తే. దీంతో అంతా కలిసి మునుగోడులో పూర్తిగా బేరసారాలు చేస్తున్నారని సమాచారం.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలంగాణ సర్కారు సరిగా నిధులివ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో లీడర్ల పరిస్థితి దివాళా తీసిందట. ఇప్పుడు మంచి బేరం తగలడం, పైసలు  కూడా భారీగా వస్తుండటంతో.. ఏ పార్టీ అయితే ఏమున్నది.. పైసలు మస్తుగొస్తున్నయని తెల్లారే సరికి కండువా మార్చేస్తున్నారట లీడర్లు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి లోకల్ బాడీల్లోని ప్రజాప్రతిధులు చాలావరకు బీజేపీ కండువాలతోనే ఉండాలని ఆ పార్టీ పెద్దలు మునుగోడు ఇంచార్జులకు చెప్పినట్టు సమాచారం. అప్పుడు తలా కొన్ని ఓట్లు వేయించినా మునుగోడులో గట్టెక్కవచ్చని అన్నారట. మునుగోడులో గెలిస్తే.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని ఖతమైందని చెప్పి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తమవైపు తిప్పుకోవచ్చనే ప్లాన్ బీజేపీ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Read Also :

admin

Recent Posts

Jeevitha Rajasekhar : జీవితా రాజశేఖర్‌కు లక్షన్నర కుచ్చుటోపీ

Jeevitha Rajasekhar :  సీని నటి జీవితా రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్లు రూ. లక్షన్నర కుచ్చుటోపి పెట్టారు. జియో…

2 days ago

Congress : బ్లాక్ షీప్ బెంగ.. అంతా ఆయన పనేనా..?

Who is blacksheep in telangana congress-1 : Telangana congress : కాంగ్రెస్ ను ముంచుతున్న “బ్లాక్ షీప్”…

2 days ago

Lawyer Pratap Goud : సిట్ విచారణలో తడబడి ఏడ్చేసిన లాయర్..!

Lawyer Pratap Goud : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ…

2 days ago

Baba Ramdev : నా కళ్లకైతే మహిళలు బట్టలు వేసుకోకపోయినా బాగుంటారు

Baba Ramdev : నిత్యం తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Baba…

2 days ago

Tirumala : సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులకు 24…

2 days ago

Jabardasth Varsha : కిటికీల జాకెట్తో వయ్యారాల వొంపులు

Jabardasth Varsha : జబర్దస్త్ లో వచ్చిన కొద్ది టైమ్ లోనే ఫెమస్ అయింది వర్ష. స్కిట్ లతోనే కాకుండా…

2 days ago