Bjp leaders not seen in eatela rajender campaign : హుజురాబాద్ లో విజయం తనదేనని ధీమాతో ముందుకెళ్తున్నారు ఈటల రాజేందర్. ఇన్నేళ్లుగా కారు గుర్తుతో జనంలోకి వెళ్లిన ఆయన.. ఇప్పుడు కమలం గుర్తుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీనేతల దూకుడుతో తన గెలుపు పక్కా అని చెప్పుకుంటున్నారు ఈటల రాజేందర్.
కానీ కొద్ది రోజుల క్రితం వరకు హుజురాబాద్ లో రాష్ట్ర బీజేపీ నేతల హడావుడి కనిపించింది. ఈటలతో పాటు.. ఒకరి తర్వాత మరొకరు హుజురాబాద్ లో ప్రచారం చేసి వచ్చారు. సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటూ ప్రకటనలు చేశారు.
కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్ గా మారిపోయింది. బీజేపీ నేతలెవరూ హుజురాబాద్ వైపు కన్నెత్తిచూడటం లేదు. మొన్నటి దాకా అడపా దడపా కనిపించిన నేతలు కూడా ఇప్పుడు లైట్ తీసుకున్నారు.
బీజేపీ నేతలు హుజురాబాద్( eatela rajender campaign) వెళ్లకపోవడానికి చాలా కారణాలున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ … బీజేపీ నేతలు చెప్పినట్టుగా కాకుండా సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారట. ఇదే అంశంపై బీజేపీ ఆఫీసులో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. “మనం చెప్పినట్టు వినడం లేదు.. ఇష్టమొచ్చినట్టు చేస్తున్నాడు.. అలాంటప్పుడు మనం వెళ్లి.. సపోర్ట్ చేయడం దేనికి..? ఆయన్నే సొంతంగా గెలిచి రమ్మనండి..” అని అంటున్నారట.
మరికొందరు మాత్రం పార్టీ ఆదేశాల ప్రకారం ఈటలకు సపోర్ట్ చేయాల్సిందేనని చెబుతున్నారట.
మరోవైపు.. ఆధిపత్యపోరు కూడా ఈటల.. బీజేపీ నేతల మధ్య గ్యాప్ పెంచినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఈటల.
బీజేపీలో ప్రస్తుతం కీలక పదవుల్లో చాలామంది కంటే కూడా ఈటల రాజేందర్ చాలా చాలా సీనియర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ గెలిచి వస్తే డామినేషన్ మరింత పెరుగుతుందనే భావనలో ఉన్నారట. హుజురాబాద్ లో కొద్ది రోజులుగా కమలనాథుల హడావుడి తగ్గిందనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
బయటకు మాత్రం ఎక్కడా..ఏ నేత కూడా అసంతృప్తిని తెలియజేయడం లేదు. అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు. కానీ లోలోపల చాలా గడబిడ నడుస్తోందట. ఇలాంటి పరిస్థితులు హుజురాబాద్ లో ఈటలను ఎటువైపు తీసుకెళతాయో చూడాలి.
Read Also:
- Guntur Ramya murder:హంతకుడు అతడే.. రమ్య మర్డర్ కు 8 నిమిషాల ముందు..!
- Mynampally : ‘బండి సంజయ్..నీ గుండు పగులుద్ది ‘.. మైనంపల్లి బూతుపురాణం..!
- Biggboss 5 Telugu : ఆగస్ట్ 15న బిగ్ సర్ప్రైజ్.. మొదలయ్యేది అప్పుడే.. !
- Mouni Roy : మనసు దోచేస్తున్న మౌనీ రాయ్
- prabhas : ప్రభాస్ అంటే పిచ్చి.. డేటింగ్‌కు కూడా రెడీనే..!
- హైపర్ ఆది పిల్ల..తోడ అందాలతో చంపుతుంది..!