Bandla Ganesh : “NTV యాంకర్ ఎందుకు అంత నోటిదూల… అక్కడెందుకు అన్నీ మూసుకుంటరు”!
Latest Telangana

Bandla Ganesh : “NTV యాంకర్ ఎందుకు అంత నోటిదూల… అక్కడెందుకు అన్నీ మూసుకుంటరు”!

Bandla Ganesh : ఇప్పుడు ఇండస్ట్రీలో మా ఎన్నికల గొడవ పెద్ద ఇష్యూగా మారిపోయింది. సినిమా వాళ్ల యూనియన్ ఎన్నికలే అయినప్పటికీ రాజకీయాలను తలపిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేష్(Bandla Ganesh)… ఇప్పుడు జనరల్ సెక్రెటరీగా సెపరేట్ గా పోటీ చేస్తున్నాడు. దీంతో మా ఎన్నికలు యమరంజుగా మారిపోయాయి.

ఇష్యూని క్యాష్ చేసుకోవడంలో మన తెలుగు మీడియా ఎలాగు ముందే ఉంటుంది. ఇప్పుడు మా ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన బండ్లని ఇంటర్వ్యూకి పిలిచింది ఎన్టీవీ మీడియా. ఓ గంట సేపు ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ కి కాస్త హైప్ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో కానీ యాంకర్.. కాస్త అతిప్రదర్శన చూపించాడు. బండ్ల గణేష్ ని నమ్మదగిన వ్యక్తేనా..? అనే క్వశ్చన్ వేశాడు.  ఎందుకంటే గతంలో ‘నాలుక’ కోసుకొంటా అని అన్నాడట..  ఇది సదరు యాంకర్ అభిప్రాయం.

నాలుక, గొంతు అంటూ దీనిపైన ఓ పదినిమిషాల డిబేట్ పెట్టాడు యాంకర్. పిలిచిన ఇంటర్వ్యూ  ఏంటి ? అసలు డిబేట్ ఏంటి? అతను నాలుకన్నాడో, గొంతు అన్నాడో .. ఎందుకు ఇప్పుడు? పాయింట్ మాట్లాడక బండ్ల గతాన్ని తవ్వడం ఎందుకు?  స్ట్రెయిట్ గా క్వశ్చన్స్ అడగలేరా? పాయింట్ మాట్లాడలేరా? ఇలాంటి ఫీలింగ్ చూసేవాళ్ళకి అనిపించింది.

Read Also :

“సరే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన రాజకీయ నేతలను తీసుకొచ్చి గతంలో మీరిచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? అని అడిగే దమ్ముందా ఇదే యాంకర్ కి, ఇదే ఛానల్ కి ఉందా .. సినిమా వాడే కదా .. ఏం పీకుతాడులే అనే లోకువే కదా “…అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

పనిలో పనిగా వీడియో కింద ఎన్టీవీ ఛానల్ ని , యాంకర్ ని కాస్త గట్టిగానే అరుసుకున్నరు.  “యాంకర్ తమ్ముడ్ని ఎక్కడినుండి తీసుకొచ్చారు. ఛానల్ పరువు తీయడానికి జీతం ఇస్తున్నారా” ఎంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “అరేయ్ ఈ యాంకర్ కి ఉద్యోగం ఇచ్చింది ఎవర్రా బాబు వాన్ని తన్నాలి. ముందు” అంటూ గట్టిగానే వేసుకున్నారు. ఇంకొందరు అయితే… “ఇంటర్వ్యూ చేసేముందు ముందు ప్రిపేర్ అవ్వండి.. తెలిసి తెలియకుండా.. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది వాగకండి… జర్నలిస్ట్ ల పరువు తీయకండి” అంటూ సలహాలు ఇస్తున్నారు.

మొత్తానికి బండ్లని ఇరికిద్దాం అని చూసిన సదరు యాంకర్ కి 1000mm రాడ్ దిగినట్టు అయింది అన్నది ఇంటర్వ్యూ చూసినోళ్ళ అభిప్రాయం.

Read Also :