Bandi Sanjay Comments On CM Kcr : బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ అయ్యాక.. ఇక్కడి పాలిటిక్స్ లో కాస్త హడావుడి మొదలైంది. అప్పటి వరకు కేసీఆర్ కు ఎదురుమాట్లాడే వ్యక్తి లేడు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదు అనే పరిస్థితి నుంచి మరో ప్రత్యామ్నాయం తయారైందని కేసీఆర్ అలర్టయ్యే పరిస్థితి వచ్చింది.
బండి సంజయ్(Bandi Sanjay) కూడా మొదటినుంచి అదే రీతిలో దూకుడుగా వెళ్తున్నారు. ప్రతీ ఇష్యూలో సర్కారును టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీని మరింత ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కాకముందు నుంచి కూడా కేసీఆర్ ఫ్యామీలిమీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు బండి సంజయ్.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక భారీగా అక్రమాస్తులు సంపాదించారని.. వారి అవినీతిని బయటపెట్టి జైలుకు పంపిస్తానని.. 2019 పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. అంతకుముందు కూడా చాలా సార్లు కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు.
ఈ మధ్య చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. కేసీఆర్ అవినీతి బయటపెడతానని.. ఆయన అక్రమాల లిస్ట్ అంతా తన దగ్గర ఉందని చెప్పారు సంజయ్(Bandi Sanjay). రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా.. దానికి ముందు ఈ కామెంట్ చేయడం సంజయ్ కి అలవాటైపోయింది. ఇప్పటికి కేసీఆర్ సీఎం అయ్యి ఏడేళ్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంజయ్ ది ఒకటే స్టేట్మెంట్.
తాజాగా వరి రైతులకు పరామర్శ పేరుతో నల్లగొండ జిల్లాలో పర్యటించిన సంజయ్.. అక్కడ కూడ మరోసారి ఇవే కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి భయం అంటే ఏంటో చూపిస్తా.. వాళ్ల అక్రమాలు బయటపెడతా.. జైలుకు పంపిస్తా.. మళ్లీ అవే డైలాగులు ఇక్కడా రిపీట్ అయ్యాయి.
కానీ ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన అవినీతి ఏంటో సంజయ్ బయటపెట్టలేదు. ఆ అక్రమాల చిట్టా ఏంటో చూపించలేదు. కానీ ఎలక్షన్ వచ్చిన ప్రతీసారి ఎమోషనల్ డ్రామా మాత్రం కంటిన్యూ చేస్తున్నారు.
ఇప్పుడెందుకీ ఎమోషనల్ డ్రామా..?
అయితే.. ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే ఈ డ్రామా అంతా ఎందుకు నడస్తోందనే ప్రశ్న మీకు రావొచ్చు. విషయం ఏంటంటే.. త్వరలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకండువా కప్పుకోబోతున్నారట.
బీజేపీలో చేరితే రాజీనామా చేయాలి కాబట్టి.. అక్కడ బైపోల్ వస్తుంది. సో.. అక్కడ బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని.. లేకపోతే ఆయన స్థానంలో మరో అభ్యర్థిని గెలిపించుకోవాలి కదా. అందుకే మళ్లీ పాత క్యాసెట్ టేప్ రికార్డర్ లో పెట్టి ప్లే చేస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
Read Also :
- RTC CHARGES : ప్రయాణికులకు షాక్.. చార్జీలు భారీగా పెంపు..!
- Paddy farmer : ఆగం చేస్తున్నది నువ్వు కాదా సారూ..?
- Telangana : తెలంగాణ పాపులర్ సీఎం క్యాండిడేట్ రేవంతేనా…?
- Vijayashanthi : ఈ ధర్నా దేనికి.. KCRకి రాములమ్మ సూటిగా 18 ప్రశ్నలు..!
- AP Municipal : కుప్పం వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు … ‘అబ్బా వద్దురా ప్లీజ్’..!
- Telangana : తెలంగాణలో మళ్ళీ ఉపఎన్నికలు.. ఆ రెండు స్థానాలకు.. !
- Harish Rao: హరీష్‌ని బయటకు పంపుడేనా..లేకా సంప్రదాయం మారుస్తారా.. కేసీఆర్ ప్లాన్ ఏంటి?
- పియానో వాయిస్తూ 12 మంది మహిళలను బుట్టలో.. నల్గొండలో నికృష్ణుడు
- KCR Press Meet : మెడలు వంచుతా అన్నోనికి మెడ మీద తలకాయ లేదని అర్ధమైంది..!
- CHINA BORDER : చైనా బార్డర్ లో ఎగరలేనమ్మ.. కశ్మీర్ ల ఏమో చేసిందట.!