D mart : డీ మార్ట్ కస్టమర్లు ఖచ్చితంగా చదవాల్సిన వార్త
Latest Telangana

D mart : డీ మార్ట్ కస్టమర్లు ఖచ్చితంగా చదవాల్సిన వార్త

Alert to D mart customers: డీమార్ట్ లో(D mart) షాపింగ్ చేసే కస్టమర్లు ఖచ్చితంగా చదవాల్సిన పోస్ట్ ఇది.

డీమార్ట్ అంటే చాలా ఆఫర్లు ఉంటాయి. మనం రెగ్యులర్ గా వాడే సరుకులు తక్కువ ధరకే వస్తాయని చాలామంది అక్కడికే వెళ్తుంటారు. ప్రతీ నెలా సరుకులు అక్కడి నుంచే తెచ్చుకుంటారు.

ఇవి కూడా చదవండి :

కానీ డీ మార్ట్ వాడు మనకు తెలియకుండానే మన జేబులకు చిల్లు పెడుతున్నాడు. ఇటీవల బయటపడుతున్న వరుస సంఘటనలు డీ మార్ట్ నిర్వాకాన్ని కళ్లకు కడుతున్నాయి.

సాధారణంగా సరుకులు కొంటే క్యారీ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వాలి. కానీ.. డీమార్ట్ లో(D mart) మాత్రం సంచి(carry bag) సైజ్ ను బట్టి 3 నుంచి 10 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్క డీమార్ట్ లోనే కాదు. అన్ని షాపింగ్ మాల్స్ లోనూ ఇదే తంతు.

పది రూపాయలే కదా అని మనం లైట్ తీసుకుంటాం. కానీ క్యారీ బ్యాగ్ ల ద్వారానే లక్షల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయంటే నమ్మలేరు.

అందుకే ఈ తతంగాన్ని పసిగట్టిన ఓ వ్యక్తి  వినియోగదారుల కమిషన్లో  కేసు వేశాడు. ఫ్రీ గా ఇవ్వాలిసిన సంచికి డబ్బులు వసూలు చేస్తున్నారని డీమార్ట్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై స్పందించిన కమిషన్.. మూడున్నర రూపాయల సంచికి గాను వెయ్యి రూపాయల ఫైన్ వేసింది. కేసు వేసిన వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు ఇకపై క్యారీ బ్యాగ్ కు డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలుంటాయని చెప్పింది.

డీమార్ట్(D mart) అక్రమ వ్యవహారం ఇదేం కొత్తకాదు. గతంలోనూ క్యారీ బ్యాగ్( carry bag) ల విషయంలో వివాదం నడిచింది. క్యారీ బ్యాగ్ కు డబ్బులు వసూలు చేస్తే దానిపై ఆ సంస్థ లోగో గానీ, ప్రచార కంటెంట్ గానీ ఉండకూడు. కానీ గతంలో డీ మార్ట్ తో పాటు.. ఇతర షాపింగ్ మాల్స్ సంచులపై ఆయా సంస్థల లోగోలు ఉండేవి. దీనిపై ఓ వ్యక్తి కేసు వేయడంతో ప్రస్తుతం ప్లేయిన్ బ్యాగులు ఇస్తున్నారు.

ఇప్పుడు వీటిపైనా  ఫిర్యాదుతో.. క్యారీ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వాల్సిందేనని చెప్పింది.

ఇవి కూడా చదవండి :