Ashok Akula : అడ్డంగా బుక్కైన ‘బుల్లెట్ బండి’ పెళ్లికొడుకు
Latest News Telangana

Ashok Akula : అడ్డంగా బుక్కైన ‘బుల్లెట్ బండి’ పెళ్లికొడుకు

Ashok Akula :  ఆ మధ్య ఓ పెళ్లి బరాత్లో పెళ్లికూతురు బుల్లెట్ బండి సాంగ్‌‌కు డాన్స్ చేసి ఫుల్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అమెతో పాటుగా ఆ పాటకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఆమె భర్తకు కూడా ఫేమసయ్యాడు. ఇప్పుడు ఆ పెళ్లికొడుకు(Ashok Akula ) మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఓ వ్యక్తిని ఇంటి నిర్మాణం కోసం లంచం అడిగి ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. బడంగ్‌‌పేట్ మున్సిపాలిటీలో ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు ఆకుల అశోక్.

Bullettu Bandi' Bride Bags Bumper Offer To Dance In A New Video Song

అక్కడికి జిల్లాలగూడకు చెందిన దేవేందర్ రెడ్డి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ అనుమతుల కోసం వచ్చాడు. అయితే అతన్ని అశోక్ రూ. 30 వేల లంచం అడిగాడు. దీంతో దేవేందర్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అశోక్‌‌ను పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. అతనితో పాటుగా ప్రైవేట్ ఆర్కిటెక్ట్ శ్రీనివాసరాజును కూడా అధికారులు రెడ్‌‌హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల కోర్టు ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరు పరిచారు.

అంతేకాకుండా అశోక్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు కొన‌సాగించారు. ఇక 2021, ఆగ‌స్టు 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన సాయి శ్రీయతో అశోక్ వివాహం అయింది.

Also Read :