JP Nadda : నడ్డా పరువు తీసిన బీజేపీ లోకల్ లీడర్లు..!
Latest News Telangana

JP Nadda : నడ్డా పరువు తీసిన బీజేపీ లోకల్ లీడర్లు..!

JP Nadda : తెలంగాణని గట్టిగానే టార్గెట్ చేసింది బీజేపీ. ఢిల్లీ నుంచి గల్లీ లీడర్ల వరకు ప్రతి ఒక్కరూ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలుకోవడం లేదు. కేసీఆర్ సర్కార్ ను ఎలాగైనా పడగొట్టాలని కంకణం కట్టుకున్నారు. కలిసొచ్చే లీడర్లనే కాదు. ఫాలోయింగ్ ఉన్న సినిమా స్టార్ హీరోలను కూడా వదలడం లేదు. రాష్ట్రంలో ఆ మధ్య పర్యటించిన అమిత్ షా, జూనియర్ ఏన్టీఆర్ తో, జేపీ నడ్డా(JP Nadda) మిథాలీ రాజ్ , నితిన్ లో భేటీ అయ్యారు. పాలిటిక్స్ తో ఎలాంటి సంబంధం లేని నితిన్ తో బీజేపీ తోపు లీడర్లు సమావేశం కావడం పెద్ద హాట్ టాపిక్ అయింది.

Bheeshma' star Nithin meets BJP chief JP Nadda

అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. వాస్తవానికి ఆ రోజున నడ్డా భేటీ కావాల్సింది నితిన్ తో కాదట.. నిఖిల్‌ తో నట. ఈ మధ్య నిఖిల్‌ నటించిన కార్తికేయ 2 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రమోషన్లు లేకున్నా బాలీవుడ్ లో కూడా అదరగొట్టింది. శ్రీ కృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నడ్డాకు బాగా నచ్చిందట.. దీనితో నిఖిల్‌ తో భేటీ ఏర్పాటు చేయాలని లోకల్ పార్టీ లీడర్లకు కబురు చేశారట. అయితే ఇక్కడ లీడర్లు పొరబడి నిఖిల్‌ కు బదులు నితిన్ కు ఆహ్వానం పంపించరాట.

Image

దీంతో బీజేపీ లీడర్లకు నితిన్‌‌కు, నిఖిల్‌‌కు ఆ మాత్రం తేడా తెలియట్లేదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వేసుకుంటున్నారు. అటు నితిన్ ను కూడా ఓ ఆట అడుకుంటున్నారు. ఎవరైనా పిలుస్తే డోర్ తీయడం కాదు… ముందు ఆరా తీయాలంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి లోకల్ లీడర్లు నడ్డా పరువు తీసరుకదయ్యా అంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టు్లు పెడుతోంది.

Also Read :