Hyderabad : అక్రమసంబంధాలు ఇప్పుడు హత్యలకి దారి తీస్తున్నాయి.. కట్టుకున్న భర్తని ప్రియుడు చేతిలో లేదా ప్రియుడుని వేరే వాళ్ళతో చంపిస్తున్నారు.. తాజాగా ఇలాంటి కేసు ఒకటి రంగారెడ్డి జిల్లా(Hyderabad) పరిథిలో చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాగ్‌అంబర్‌పేట్‌కు చెందిన యశ్మకుమార్….. వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.. అతినికి ఫేస్బుక్లో అప్పటికే పెళ్ళైన శ్వేతారెడ్డితో పరిచయం అయింది.
ఆ పరిచయం కాస్తా అక్రమసంబంధానికి దారి తీసింది. కొన్నిరోజులు వ్యవహారం బాగానే నడిచింది.. అయితే యశ్మకుమార్….. తనని పెళ్లి చేసుకోవాలని లేదంటే వ్యక్తిగత వీడియోలను, ఫోటోలను బయటపెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే అతన్ని అంతమొందించడానికి శ్వేతారెడ్డి ఫేస్‌బుక్‌నే నమ్ముకుంది.. ఏపీలోని కృష్టా జిల్లా తిరువురుకు చెందిన కొంగల అశోక్‌తో ఫేస్బుక్లో పరిచయాన్ని పెంచుకుంది.
అతనికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. మే 4న నగరానికి వచ్చిన అశోక్…. శ్వేతతో కలిసి యశ్మకుమార్ పై దాడికి దిగాడు.. అతని తలపైన గట్టిగా కొట్టి అక్కడినుంచి పరారయ్యారు.. వీరికి మరో వ్యక్తీ సహాయం చేశాడు. తీవ్రంగా గాయపడిన యశ్మకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 6న మృతి చెందాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు శ్వేతారెడ్డి, అశోక్‌తో పాటు వారికి సహకరించిన మరొకరిని అరెస్ట్ చేశారు.
Also Read :
- Padhu padmavathi : టిక్ టాక్ ఫేమ్ పద్దు.. మామూలుగా లేదు మరి..!
- Sarkaru Vaari Paata Review : సర్కారు వారి పాట హిట్టా.. ఫట్టా..!?
- Nayanthara : జూన్ 9న నయనతార పెళ్లి..ఎక్కడంటే?