పియానో వాయిస్తూ 12 మంది మహిళలను బుట్టలో..  నల్గొండలో నికృష్ణుడు
Latest News Telangana

పియానో వాయిస్తూ 12 మంది మహిళలను బుట్టలో.. నల్గొండలో నికృష్ణుడు

Nalgonda : నల్గొండ(Nalgonda)లోని ఓ చర్చిలో పియానో వాయించే విలియమ్సన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దాదాపు డజను మందికిపైగా మహిళలను లోబర్చుకుని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. విలియమ్సన్ పై ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటాని చెప్పి సహజీవనం చేసి వదిలేశాడని ఓ మహిళ నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొద్ది రోజుల కిందటే మరో మహిళ మునుగోడు పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. చర్చికి వచ్చే మహిళలు, యువతులను లోబర్చుకుని విలియమ్సన్ మోసం చేస్తున్నాడని… దాదాపు డజన్ మందికిపైగా మహిళలు విలియమ్సన్ చేతిలో మోసపోయారని పోలీసులకు తెలిపింది.

విలియమ్సన్ పై మహిళల ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. విలియమ్సన్ ను పిలిపించి ప్రశ్నించారు. విచారణ సమయంలో విలియమ్సన్ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అతన్ని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు పోలీసులు. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న విలియమ్సన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read :