NIrmala Sitharaman : నిర్మలమ్మకు.. నిర్మలమైన హృదయంతో…
Latest Telangana

NIrmala Sitharaman : నిర్మలమ్మకు.. నిర్మలమైన హృదయంతో…

A Letter To NIrmala Sitharaman :

నిర్మలమ్మకు.. నిర్మలమైన హృదయంతో రాయునది…

గౌరవనీయులైన కేంద్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు, తెలుగు రాష్ట్రానికి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ గారికి..

మేడం మా తెలంగాణ సుభిక్షంగానే ఉంది. మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయి.? మా రాష్ట్రంలో తిరుగుతున్నారు సరే. తిరగండి. పల్లెల్లోకి వెళ్లండి. పచ్చని పొలాలను, గలగలా పారుతున్న కాలువలను చూడండి. నాలుగు రోజులాగితే ఇక్కడి పంటల రాశులను కూడా చూసివెళ్లొచ్చు.

మేడం నిర్మల గారూ.. అంతా బాగానే ఉంది కానీ..

పెద్ద పదవుల్లో ఉన్నప్పుడుకాస్త హుందాగా నడుచుకోవాలి. తమ గౌరవం, తామున్న పదవి గౌరవాన్ని కాపాడాలి. కానీ బీజేపీనేతలకు అవేవీ ఉండవు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. తప్పుడు ప్రచారం చేయడం, అబద్దాలు ప్రచారం చేయడమే వాళ్లకు అలవాటు. ట్వీట్లు చేసినా,పబ్లిక్  లోకి వచ్చినా మాట్లాడినా.. వాళ్ల తప్పుల సంగతి బయటకు తీయకుండా ఇతరుల తప్పుల గురించే చెబుతుంటారు.

రాష్ట్రానికి వచ్చిన ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్(nirmala sitharaman) కూడా అదే పనిచేశారు. ప్రాపగాండా చేయాలన్న ఆతృతలో ఓ ఐఏఎస్ అధికారితోనూ దిగజారి ప్రవర్తించారు. రేషన్ షాపును పరిశీలించడానికి వెళ్లిన నిర్మలాసీతారామన్ చేయాల్సింది ఏంటీ..? బియ్యం సరిగా వస్తున్నాయా.? నాణ్యంగా ఉన్నాయా..? అందులో రాళ్లున్నాయా..? పురుగులున్నాయా..? అని అడగాలి.

కానీ ఆమె చేసిన రచ్చ ఏంటీ..?

మోడీ ఫొటో లేదని గాయి గాయి చేసి.. వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అయ్యే ప్రయత్నం చేశారు. ఎలాగూ అనుకూల మీడియా ఉంది కాబట్టి.. పొద్దంతా అదే వీడియోతోపొద్దుగడిపారు.

కలెక్టర్ తో మిస్ బిహేవ్ చేశారనే విషయాన్ని కూడా మరిచిపోయారు. అదే వేరే పార్టీ వాళ్లు అలాఅడిగి ఉంటే.. కలెక్టర్ పై దాడి అని రాసేవాళ్లు. కానీ నిర్మల సీతారామన్ చేసిన పనిని మాత్రం సమర్థించుకున్నారు.

రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత..? తెలంగాణ వాటా ఎంత..?

సరే.. దాని గురించికూడా మాట్లాడుకుందాం..

కానీ మేడం నిర్మలాజీ(nirmala sitharaman).. కాస్త ఇవి కూడా తెలుసుకోండి.. ఆ తర్వాతే మాట్లాడండి.

రేషన్ కార్డు ఇవ్వడానికి మీరు పెట్టిన కండీషన్లు ఏంటీ..
గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేలు

పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.75 వేలు

ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా..?

అందుకే గ్రామీణ ప్రాంతరాల్లో ఆదాయ పరిమితి లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి రెండు లక్షలకు పెంచాలని కోరింది. కానీ మీరేం చేశారు.?

మీరు తెలంగాణకు బియ్యం ఇస్తున్న ధర కేజీ.4.40 పైసలు

కానీ తెలంగాణ సర్కారు ప్రజలకు ఇస్తున్నది రూపాయికే కిలో బియ్యం. మీరు ఒక వ్యక్తికి 5కిలోల బియ్యమే ఇవ్వాలని నిబంధన పెట్టారు. కానీ తెలంగాణ సర్కారు ఆరుకిలోలు ఇస్తోంది. కాస్త.. మీ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిని అడగండి చెప్తారు.

అంతేగానీ.. ప్లీజ్ ఇలా వచ్చి మీడియాలో కనిపించాలని హడావుడి చేసి పరువుతీసుకోకండి.

ఇక.. అప్పుల విషయానికొద్దాం..

రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్ష రూపాయల అప్పు ఉందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. సరే మేడం రాష్ట్రం అన్నాక అప్పు చేయడంకామన్. కానీ ఆ అప్పులతో ఏం చేస్తున్నారన్నది కూడా చూడాలి కదా. తెలంగాణ తీసుకొచ్చిన అప్పు యువతకు ఉపాధి మార్గం చూపిస్తోంది. వయసు పైబడినోళ్లకు, ఎవరూ లేనోళ్లకు ఆసరా అవుతోంది. రైతుబంధుగా తోడుగా ఉంటోంది.

సరే.. మీ మోడీగారు తెచ్చిన అప్పుల గురించి చెప్పండి.

2014కు ముందు దేశానికిఉన్నఅప్పులెన్ని..? ఇప్పుడు మీ ఘనత వహించిన విశ్వగురువుమోడీ గారుదాన్ని ఎక్కడికి తీసుకుపోయారు.?

Read Also :

2013-14ల దేశం అప్పు 55 లక్షల 87 వేల149 కోట్లు. 8 ఏళ్ల విశ్వగురువు పాలనల అది కోటి 35 లక్షల87 వేల893 కోట్లకు పెరిగింది. దేశాన్ని 65 ఏళ్లు పరిపాలించిన ప్రధానమంత్రులు 55 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోడీ ప్రధాని అయ్యాక కేవలం 8 ఏళ్లలో 100 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. తెలంగాణ గురించి మాట్లాడే మీరు… కాస్త మీరు చేసిన అప్పులు.. వాటితో ఒక్కొక్కరిపై ఉన్న 10 లక్షలకు పైగాఉన్న అప్పు గురించి కూడా మాట్లాడండి.

మరి ఇన్ని అప్పులు చేసి ఒరగబెట్టింది ఏమన్నా ఉందా అంటే.. అదీ లేదు. ఆకలితో అల్లాడుతున్న వారున్న లిస్ట్ లో, పేదరికంలో భారతదేశమే ముందుంటుంది. ఖజానా నుంచి తీసే ప్రతీ పైసా.. తన కార్పొరేట్ మిత్రుల జేబుల్లోనే వేస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. పెరుగుతున్న అంబానీ, అదానీ ఆస్తులు.. వాళ్లకు మాఫీ చేస్తున్న రుణాలు చూస్తేనే అర్థమవుతోంది కదా.. మీ కార్పొరేట్ ఉదార హృదయం గురించి. మీరొచ్చి మాకు నీతులు చెప్పడం ఏంటండి.

మా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే ఇవ్వట్లేదు. మీదికెళ్లి గొర్రెల పైసలు మావే, చేపల పైసలు మావే అని చెప్పుకుంటున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని చెప్పినోళ్లు.. ఆ ప్రాజెక్టు కేంద్రం పైసలిచ్చిందని చెప్పుకునుడు పద్దతేనా..?

ఆయుష్మాన్ భారత్ ల తెలంగాణల అమలైతున్నదో లేదో..  ఓ సారి మీ ఆరోగ్యశాఖ మంత్రిని అడుగున్రి.

కానీ.. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను కార్లతోని తొక్కిచ్చుడు తప్ప.. ఎన్నడన్న వాళ్లను పట్టించుకున్నరా..?

మీరు చేసింది గుండుసున్నా.. తెలంగాణకు ఇచ్చేది గుండుసున్నా.. అయినా సరే తెలంగాణ సర్కారు మీద దుమ్మెత్తిపోయాలన్న ఏకైక లక్ష్యంతో ఏది పడితే అది మాట్లాడకండి.

మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మిగతా లీడర్ల లాగా మీరు కూడా మాట్లాడితే.. ఆర్థికమంత్రి హోదాలో ఉన్న మీకు.. వాళ్లకు తేడా ఏముంది చెప్పండి. JNUలో చదివినోళ్లకు.. చదువు రానోళ్లకు తేడా లేదా..?

 

ఇట్లు

తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే ఓ వ్యక్తి