Haleem : రంజాన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హలీమ్. నోరూరించే ఈ హలీం(Haleem)ను టేస్ట్ చేయాడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ ఏడాది రంజాన్ మాసంలో హైదరాబాద్ లో మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు ఏకంగా 4 లక్షల హలీంలు, పది లక్షల బిర్యానీలు ఆర్డర్ చేసినట్టుగా ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది.
చికెన్, పాలమూరు పొట్టేల్, పెర్షియన్ స్పెషల్ హలీం, డ్రై ఫ్రూట్స్ హలీం, మటన్ హలీంలు అధికంగా కస్టమర్లు కొనుగోలు చేసినట్టుగా వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే అన్నిరకాల వంటకాలకు 20 శాతం అధికంగా డెలవరీ చేసినట్లుగా స్విగ్గీ తెలిపింది. ఇక సుమారుగా 5 లక్షలకు పైగా డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.
ఒక్క స్విగ్గీ ద్వారనే ఇంతలా ఆర్డర్లు వస్తే మిగతా యాప్‌లు, డైరక్ట్ గా హోటళ్లలోకి వెళ్లి తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని తెలుస్తోంది.
Also Read :
- prathyusha sadhu : ఐపీఎల్‌కు గ్లామర్.. ఎవరీ ప్రత్యూష సాధు?
- Supritha : అమ్మాయిని ఆపలేకపోతున్నమ్.. బరితెగించిన సురేఖవాణి కూతురు