home page

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టీఆర్ఎస్ కు చెక్ పెట్టే ప్రయత్నాల్లో బీజేపీ
 | 
telangana bjp master plan for operation trs

- తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలు

- అసంతృప్తులపై కన్నేసిన కమలం నేతలు

- UT బ్యాచ్ పై బీజేపీ ఫోకస్

తెలంగాణ బీజేపీ మళ్లీ జోరు పెంచుతోంది. దుబ్బాక ఎన్నికల తర్వాత పార్టీలో ఫుల్ జోష్ కనిపించినా.. నాగార్జునాసాగర్ బైపోల్ ఎన్నికల తర్వాత అది మొత్తం తుస్సుమంది. బీజేపీ అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు రావడంతో పార్టీ పెద్దలు పునరాలోచనలో పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

అయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తమ సత్తా చూపించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. దీనికి తగినట్టుగానే ఢిల్లీ నాయకత్వం డైరెక్షన్ లో రాష్ట్రంలో పావులు కదుపుతున్నారు.

ఇదే టైంలో బీజేపీకి ఓ వజ్రాయుధంలా దొరికారు ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగిన నేతగా ఆయనకు పేరుంది. ప్రజల్లో మంచి పేరుంది. అలాంటి లీడర్ పై కేసీఆర్ కక్షగట్టి భూ స్కాం పేరుతో పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారనే సింపథి కూడా ఇప్పుడు ఈటలపై ఉంది.

EATELA RAJENDER

అయితే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ నేతలతోనూ ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్నారు.

అయితే... ఏది ఏమైనా ఈటలను బీజేపీలోకి తీసుకురావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటలపైన్న సింపథితో రాబోయే ఎన్నికల్లో మరిన్ని ఓట్లు, సీట్లు రాబట్టవచ్చని వారి ఆలోచనగా తెలుస్తోంది.

అయితే.. తెలంగాణ బీజేపీ నేతలు మరో మాస్టర్ ప్లాన్ వేశారట. అది పక్కాగా అమలైతే మాత్రం టీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమనే చెప్పాలి.

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో... ఉద్యమం బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారి కంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన బంగారు తెలంగాణ బ్యాచ్ కే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉందనే విమర్శలున్నాయి. ఉద్యమం నుంచి ఉన్నవారికి అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతోందని చాలా మంది ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా.. టీఆర్ఎస్ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తోన్న నేతలందర్ని గంపగుత్తగా బీజేపీలోకి లాగాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. అవమానంతో టీఆర్ఎస్ లో ఉండేకంటే.. గౌరవం దొరికే బీజేపీలోకి రావాలంటూ.. ఆ పార్టీ నేతలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట.

గతంలో మండలి చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్.. తన పదవి పొడిగించలేదనే అసంతృప్తితో బీజేపీలో చేరిపోయారు.    

ఇలా పదవులు కోల్పోయిన వారు. పదవులు వస్తాయని ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు టీఆర్ఎస్ లో వందలాది మంది ఉన్నారు.

ప్రస్తుతం ఈటల కూడా అలాంటి అవమానంతోనే పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అందుకే ఆయనతో పాటు.. ఆయన వెంట ఉన్న కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, మరో కీలక నేత ఏనుగు రవీందర్ రెడ్డి, వీరితో పాటో అసంతృప్తిగా ఉన్న మరికొందరు నేతలను బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారట. అన్ని జిల్లాల్లోనూ ప్రస్తుతం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోందని సమాచారం.

బీజేపీ చేపట్టిన ఈ కొత్త ఆపరేషన్ సక్సెస్ అయితే.. గులాబీ బాస్ కు తిప్పలు తప్పవు. కానీ.. క్రైసిస్ ను మేనేజ్ చేయడం.. సమస్య వచ్చినప్పుడు కొత్త వ్యూహంతో తెరముందుకొచ్చి.. అందరి దృష్టి మళ్లించి తన పని తాను చేసుకుకోవడం కేసీఆర్ నైజం. ఈ ఇష్యూలో బీజేపీ వ్యూహం గెలుస్తుందో.. కేసీఆర్ ప్రతివ్యూహం.. ఫలిస్తుందో.. వేచి చూడాలి.

READ ALSO:

రాందేవ్ బాబాపై దేశద్రోహం కేసు..! పెద్ద షాకిచ్చిన IMA..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

తెల్ల చీర.. తెల్లతోలు.. అబ్బబ్బా.. ఏమి అందం.. 

అందాల దివి... ఒక్కో ఫోటో అరాచకం..!