home page

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

సింపుల్ టిప్స్ తో అజీర్తి మాయం
 | 
solution for digestive problems

శరీరానికి శక్తి రావాలంటే భోజనం చేస్తే సరిపోదు. అది సరిగ్గా జీర్ణమై.. అందులోని పోషకాలు శరీరానికి అందాలి. అప్పుడే మనకు శక్తి వచ్చి ఏదైనా పని చేయగలం. కానీ ప్రస్తుతం చాలా మందిలో అజీర్తి సమస్య ఏర్పడుతోంది.

పిడికెడు మెతుకులు తిన్నా అవి జీర్ణం కాక.. నానా అవస్థలు పడుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, రోజు రోజుకు మారిపోతున్న జీవన విధానమే దీనికి కారణం.

తిన్నతి జీర్ణం కాకపోతే.. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఇది మరిన్ని కొత్త సమస్యలకు దారితీస్తుంది. అజీర్తి సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది ట్యాబ్లెట్లు వాడుతుంటారు. అయితే.. అతిగా ట్యాబ్లెట్లు వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

మెడిసిన్స్ లేకుండా.. కొన్ని సింపుల్ టెక్నిక్స్ తో అజీర్తి సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో ఇపుడు చూద్దాం

- భోజనం చేసేటప్పుడు వేరే పనులు చేయొద్దు. ఫొన్ తో ఆడటం, టీవీ చూడటం వంటివి పక్కన పెట్టేయడం మస్ట్.

- భోజనం చేశాక ఓ గ్లాసు వేడినీళ్లు తాగాలి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

- రాత్రి బాగా తినేసి పడుకుంటే.. తెల్లారేసరికి అది జీర్ణం కాదు. ఇలాంటి సమయంలో ఉదయాన్నే లేచి రెండు గ్లాసుల వేడి నీరు తాగాలి. కొద్ది సేపట్లోనే ఆహారం జీర్ణం అయిపోతుంది.

- అజీర్తి సమస్య ఉన్నవారు.. భోజనం చేసే ముందు చిన్ని అల్లం ముక్క, కాస్త నిమ్మరసం తీసుకోవడం బెటర్.

- లంచ్ లో ఓ గ్లాస్ లస్సీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

- చాలామంది మధ్యాహ్నం తక్కువగా తిని.. రాత్రి ఎక్కువగా తింటారు. ఇది పెద్ద పొరపాటు. చాలా అనారోగ్య సమస్యలకు ఇది కారణమవుతుంది. అందుకే మధ్యాహ్నం ఎక్కువగా తినాలి. రాత్రిపూట తక్కువగా తినాలి. రాత్రి సమయంలో లైట్ ఫుడ్ అంటే త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు, పండ్లు, వెజ్ సలాడ్ తీసుకోవడం చాలా బెటర్.

- రాత్రి సమయంలో వీలైనంత త్వరగా అంటే.. 7 నుంచి 8 గంటల మధ్యలో భోజనం చేయడం ఆరోగ్యకరం.

- రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం మంచిది కాదు. కాసేపు అటూ ఇటు నడవాలి.

ఈ చిట్కాలు పాటిస్తే.. జీర్ణసమస్యలు తగ్గిపోయి.. మానసిక ప్రశాంతత కూడా వస్తుంది.

READ ALSO:

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాందేవ్ బాబాపై దేశద్రోహం కేసు..! పెద్ద షాకిచ్చిన IMA..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

తెల్ల చీర.. తెల్లతోలు.. అబ్బబ్బా.. ఏమి అందం.. 

అందాల దివి... ఒక్కో ఫోటో అరాచకం..!