Chanda Nagar Case : హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ (Chanda Nagar Case ) పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఓ యువతి హత్యకు గురైన సంగతి తెలిసిందే..అయితే ఈ కేసులో ఇప్పుడు అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవిడికి చెందిన నాగచైతన్య(24) స్థానికంగా ఉండే జిన్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసింది.
అదే హాస్పిటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు కోటీరెడ్డి(29).. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గతేడాది కాలం నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో నాగచైతన్య నర్సుగా పని చేస్తోంది. అయితే తనని పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య, కోటీరెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆమెను అంతం చేయాలనీ భావించాడు కోటీరెడ్డి.
అందులో భాగంగానే ఈ నెల 23వ తేదీ ఉదయం సిటిజన్ ఆస్పత్రి వరకు వచ్చిన అతను.. సాయంత్రం వరకు అక్కడే ఉండి నాగచైతన్యను ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్లోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఓడ్కా తాగి రాత్రి అక్కడే బస చేసిన అతను… స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్ చేశాడు.
అనంతరం నాగచైతన్యను హత్య చేసి… 24 తేదీ ఉదయం 11 గంటలకు హోటల్ గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. అక్కడినుంచి రాత్రి 10.30కి ఒంగోలు వెళ్లి గాయలతో ఆసుపత్రిలోచేరాడు.
అతను నాగచైతన్యను హత్య చేసి ట్రైన్లో ఒంగోలుకు చేరుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో కోటీరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read :
- ప్రేమ,పెళ్లి .. గర్భవతిని చేసి మరో అమ్మాయి మేడలో మూడు ముళ్ళు..!
- Cheating Love : ప్రేమ,పెళ్లి అన్నాడు.. గర్భవతిని చేసి పరారయ్యాడు..!