Sewing machines In V6news vehicle: హుజురాబాల్ అసెంబ్లీ(huzurabad bypoll) స్థానానికి జరుగుతున్న బైపోల్ రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఈటల రాజేందర్(eatela rajender), బీజేపీ(bjp) లోగో ఉన్న గోడ గడియారాలు, గొడుగుల పంపిణీ జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. బీజేపీ నేతలు కుట్టు మిషన్లు కూడా పంచుతున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత వివేక్ కు చెందిన వీ6 వెలుగు(v6 velugu) స్టిక్కర్ ఉన్న్ వాహనంలో కుట్టు మిషన్లు(Sewing machines) పెద్ద సంఖ్యలో తరలిస్తున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీ6 వెలుగు వాహనంలో కుట్టు మెషిన్లు.. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హుజురాబాద్ లో ఓటర్లకు ఇచ్చేందుకే కుట్టు మిషన్లు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీడియా వాహనంలో తీసుకెళ్తే ఎవరూ ఆపరనే ఉద్దేశంతోనే బీజేపీ నేత వివేక్ తన వాహనంలో కుట్టుమిషన్లు పంపుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈటల రాజేందర్ ను బీజేపీలోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు వివేక్(vivek venkataseamy). ఇప్పుడు ఆయన గెలుపులో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. తన మీడియా సంస్థ అయిన వీ6 వెలుగులో.. ఈటల రాజేందర్ కు ఫుల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీ6 వాహనంలో కుట్టుమెషిన్లు కనిపించడం ఆసక్తికరంగా మారింది.
వీడియోపై V6 వివరణ
కుట్టు మెషిన్ల ఇష్యూ సోషల్ మీడియాలో దుమారంరేపడంతో.. వీ6 దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోతో హుజురాబాద్ కు సంబంధం లేదని చెప్పింది. వెలుగు పేపర్ తరలించే వ్యాన్ డ్రైవర్ ఖాళీ సమయంలో కిరాయి వెళ్లాడని చెప్పింది. పింక్ మీడియా కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యింది.
Read Also :
- కేసులు పెరుగుతున్నాయ్.. లైట్ తీసుకుంటే ఖతమే..!
- మోత్కుపల్లి నర్సింహులుకి సీఎం కేసీఆర్ కీలక పదవి..!
- అనసూయ షేకింగ్ లుక్.. !
- Esther Anil : ఆమె కన్నా.. వేసుకున్న డ్రెస్ బరువే ఎక్కువ..!