home page

Revanth Reddy : పాపం రేవంత్ ప్లాన్ వేశాడు కానీ...?

నిజంగానే వివేక్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా..? 
 | 
revanth reddy plan failed on vivek

రాష్ట్ర రాజకీయాల్లో గత పదిరోజులుగా చాలా కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టాక.. కాంగ్రెస్ లో మార్పు సంగతి పక్కనపెడితే.. ఇతర పార్టీల్లో మాత్రం ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ నేతల మాటల్లో చేతల్లో మార్పు కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి ముందు నుంచి చురుకైన నాయకుడు. ఆయనకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. ఓటుకు నోటు వంటి కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఆయన క్రేజ్ తగ్గలేదు. రేవంత్ కు పీసీసీ పదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరుదామని చాలా మంది నేతులు ఎదురుచూస్తున్నారనే వార్తలు చాలాకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ కు పగ్గాలు అప్పజెప్పడంతో.. తన స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.

వాస్తవానికి కాంగ్రెస్ లో చాలా కాలంగా కుమ్ములాటలున్నాయి. దీని ఎఫెక్ట్ చాలామంది పార్టీకి దూరమయ్యారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో కూడా నల్గొండకు చెందిన లీడర్ల మధ్యే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. దీంతో చాలామంది సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు రేవంత్ ఎంట్రీతో సైలెంట్ అయిన వారు.. సైడ్ అయిన వారు తిరిగి పార్టీలోకి వస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ తో పాటు, బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్.

మామూలుగా ప్రయత్నాలు చేస్తే ఫర్లేదు. కానీ ఆయన అమలు చేస్తున్న స్ట్రాటజీనే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అకడ్నుంచి మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ టీఆర్ఎస్ కు వచ్చారు. అక్కడ్నుంచి వెళ్లి బీజేపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు ఆయనను కూడా కాంగ్రెస్ లోకి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రెండు మూడు రోజులుగా ఫుల్లుగా ప్రచారం జరుగుతోంది.

ఏకంగా ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ లో అయితే.. రేవంత్ రెడ్డి, వివేక్ రహస్యంగా భేటీ అయ్యారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు వివేక్ మనుషులు.

అయితే... ఇదంతా రేవంత్ రెడ్డి స్ట్రాటజీలో బాగమేననే మాట వినిపిస్తోంది. పార్టీ మారుతున్నారంటూ ఓ లీక్ ఇస్తే.. ఆ నాయకుడి అనుచరుల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. పబ్లిక్ లో చర్చ జరుగుతుంది. దీంతో పార్టీ మారక తప్పనిపరిస్థితులు క్రియేట్ చేయాలనేది రేవంత్ స్ట్రాటజీగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే వివేక్ ను ఈ వివాదంలోకి లాగరని టాక్.

వివేక్ మాత్రం ఇప్పట్లో బీజేపీని వీడే పరిస్థితులు కనిపించడం లేదు. స్వయంగా ఈటలను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీలో చేర్పించిన వివేక్.. ఆ పార్టీని వీడుతారని అనుకోవడం పొరపాటే.

Read Also :

ఈమె చీర కడితే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే..! 

పలిగిన గోడల్లో పిల్ల నాజూకు అందాలు..! 

ఈ ఏజ్ లో కూడా రెచ్చిపోతున్న ఈవివి హీరోయిన్..! 

tamannaah : మిల్క్ బ్యూటీ.. ఏంటా మెలికలు..!