Petrol And Diesel : పెట్రో మంటలు.. తగ్గేదే..లే.. ! త్వరలో వంట గ్యాస్ మరో వంద..!
Latest National News

Petrol And Diesel : పెట్రో మంటలు.. తగ్గేదే..లే.. ! త్వరలో వంట గ్యాస్ మరో వంద..!

Petrol And Diesel : పెట్రో మంటలు రగులుతూనే ఉన్నాయి. ఢిల్లీలో తప్ప దేశంలో ఎక్కడా లీటర్ డీజిల్(Petrol And Diesel) వంద రూపాయల కంటే తక్కువ లేదు. పెట్రోల్‌ అయితే ఏకంగా 120 రూపాయల వైపు పరుగులు పెడుతోంది. అయినా సరే.. ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మాత్రం ఇంధన ధరల పెంపును ఆపడం లేదు. రోజుకో 35 పైసల చొప్పున పెంచుతోంది. వారం గడిచే సరికి లీటర్ పెట్రోల్, డీజిల్‌ ధర ఏకంగా రూపాయి పెరిగి కూర్చొంటోంది. ఏ రోజుకారోజు సరికొత్త రికార్డులను టచ్‌ చేస్తున్నాయి పెట్రోల్, డీజిల్ రేట్లు.

ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 113 రూపాయలు, డీజిల్‌ 106 రూపాయలకు అమ్ముతున్నారు. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌కు 105 రూపాయలు, డీజిల్‌కు 101 రూపాయలు వసూలు చేస్తున్నారు. ముంబైలో పెట్రోల్‌ రేటు 114 రూపాయలకు, ఢిల్లీలో పెట్రోల్‌ రేటు 108 రూపాయలకు, కోల్‌కతాలో పెట్రోల్‌ 109 రూపాయలకు పెరిగింది.

పెట్రోల్, డీజిలే కాదు.. వంట గ్యాస్‌ ధరను సైతం మరో వంద రూపాయలు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఆలస్యం సిలిండర్‌ రేటు అమాంతం పెరిగిపోనుంది. ఈ దెబ్బతో ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయలకు దాటడం ఖాయం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల పెరుగుదల ప్రభావం.. రోజు కూలీ చేసుకునే వారిపై సైతం ప్రభావం చూపిస్తోంది. అయినా సరే.. కేంద్రం చూస్తుండిపోతోంది తప్ప ధరలు అదుపు చేయడం లేదు.

Also Read :