home page

హెడ్మాస్టర్ కోటయ్య మృతికి మెడికల్ మాఫియానే కారణమా..?

కోటయ్య మృతిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న కామెంట్లు
 | 
nellore head master kotaiah died

నెల్లూరు ఆనందయ్య మందు అద్భుతమంటూ పొగిడిన హెడ్మాస్టర్ కోటయ్య చనిపోయారు. కరోనాతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ కన్నుమూశారు.

నెల్లూర్ ఆనందయ్య ఆయుర్వేద వైద్యం గురించి టీవీల్లో రావడం మొదలయ్యాక.. ఆ మందు గురించి టీవీల్లో చెప్పిన వ్యక్తి హెడ్మాస్టర్ కోటయ్య. మందు అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఆక్సీజన్ పెట్టుకుని అక్కడకు వచ్చిన తాను.. నిమిషాల వ్యవధిలోనే బాగైపోయానంటూ చెప్పుకొచ్చారు.

తన కళ్లలో ఓ పసరు లాంటిది పోశారని.. తర్వాత 15 నిమిషాల్లోనే తన శ్వాస సమస్య సెట్ అయ్యిందని కోటయ్య చెప్పారు. ఆయన మాట్లాడిన టీవీ ఛానల్లలో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

అయితే.. ఇప్పుడు ఆయన చనిపోవడంతో ఆనందయ్య మందును స్వాగతించే వారు విషాధంలో మునిగిపోయారు. ఈ ఇష్యూలో ఇప్పుడు మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. కోటయ్యది సాధారణ మరణం కాదని.. మెడికల్ మాఫియానే అతడిని హత్య చేసిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

కోటయ్య నిజంగానే కోలుకుని, సాధారణ వ్యక్తిలాగా బయటకు వస్తే.. అందరూ ఆనందయ్య మందునే విశ్వసిస్తారు. అల్లోపతి మందులు తగ్గించేస్తారు. కరోనా సోకిన వారంతా కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్లకుండా.. నెల్లూరు ఆనందయ్య ఆశ్రమానికి పరుగులు పెడతారు.

ప్రజల్లో ఆనందయ్య మందుపై ఉన్న విశ్వాసాన్ని చంపేందుకే  మెడికల్ మాఫియా.. హెడ్మాస్టర్ కోటయ్యను పొట్టన పెట్టుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు.. కోటయ్యను మెడికల్ మాఫియా చంపిసింది. కనీసం ఆనందయ్యనైనా కాపాడండి.. అంటూ సేవ్ ఆనందయ్య ఉద్యమం మొదలుపెడుతున్నారు పబ్లిక్.

అయితే.. నెల్లూరు ఆనందయ్య ఆశ్రమానికి రాకముందే కోటయ్య ఆరోగ్యం క్షీణించింది. ఆశ్రమానికి వచ్చాక తాను కాస్త బాగయ్యానని ఆయన చెప్పారు. అదయ్యాక రెండు మూడు రోజులకు మళ్లీ సేమ్ పరిస్థితి. కోటయ్యకు మళ్లీ ఆక్సీజన్ శాచురేషన్ లెవల్స్ పడిపోయాయి. ఆ సమస్యతోనే కోటయ్య చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు.