Yati Narsinghanand : అలా అయితే 50% హిందువులు ముస్లిం మతంలోకి వెళ్తారు..!
Latest National News

Yati Narsinghanand : అలా అయితే 50% హిందువులు ముస్లిం మతంలోకి వెళ్తారు..!

Yati Narsinghanand : మత గురువు యతి నర్సింహానంద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఆదివారం ఢిల్లీలో హిందూ మహాపంచాయత్‌ను ఉద్దేశించి ప్రసగించిన ఆయన.. 2029లో లేదా 2034లో లేదా 2039లో ఓ ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉంది. ఒక ముస్లిం ప్రధాని అయితే 50 శాతం హిందువులు మతం మారతారని, 40 శాతం మంది చంపబడతారని మిగిలిన 10 శాతం మంది ఇతర దేశాలలో నివసిస్తున్నారంటూ యతి నర్సింహానంద్(Yati Narsinghanand)  వ్యాఖ్యలు  చేశారు.

ఇది హిందువుల భవిష్యత్తు అవుతుంది కాబట్టి హిందువులు తమ ఉనికి కోసం పోరాడేందుకు ఆయుధాలు పట్టాలని ఉద్బోధించారు. తమ డిమాండ్లను నెరవేర్చమని హిందువులు వేడుకోవడం నేను చాలా కాలంగా చూశాను. కానీ ఏ ఒక్క హిందువు డిమాండ్ కూడా నెరవేరడం నేను చూడలేదు. భిక్షాటన చేయడం ద్వారా కాదు, కోర్టు జోక్యంతో మాకు రామజన్మభూమి వచ్చింది, కాబట్టి బిచ్చగాడిగా ఉండటం మానేయండి అని తన ప్రసంగంలో వాఖ్యానించారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఆయన పైన సెక్షన్ 153A కింద కేసు నమోదైంది. యతి నర్సింహానంద్ ఇలాంటి కామెంట్స్ చేయడం తొలిసారి ఏం కాదు.. అంతకుముందు, 2021 డిసెంబర్‌లో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు.. అప్పుడు కూడా ఈయన పైన కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయనకీ బెయిల్ మంజూరు చేయబడింది.

హిందూ మహాపంచాయత్‌కు సంబంధించి ఆదివారం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఒక ఎఫ్‌ఐఆర్ ద్వేషపూరిత ప్రసంగ ఆరోపణకు సంబంధించినది కాగా, మిగిలిన రెండు జర్నలిస్టుల ఫిర్యాదులపై నమోదు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో తమపై దాడి జరిగిందని జర్నలిస్టులు తెలిపారు. అన్ని కేసులను విచారిస్తున్నామని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

Also Read :