బత్తాయి బ్యాచ్ మొత్తం ఎందుకు అదానీని కాపాడే ప్రయత్నం చేస్తోంది..?
Latest National News

బత్తాయి బ్యాచ్ మొత్తం ఎందుకు అదానీని కాపాడే ప్రయత్నం చేస్తోంది..?

  • బత్తాయి బ్యాచ్ మొత్తం ఎందుకు అదానీని కాపాడే ప్రయత్నం చేస్తోంది..?
  • సోషల్ మీడియాలో ఎందుకు పెయిడ్ బత్తాయి బ్యాచులు అదానీ మీద వ్యాసాలు రాస్తున్నాయి..?
  • కాషాయా మీడియా ఎందుకు అదానీ స్కాంను చూపించడం లేదు..?
  • బీజేపీ నేతలు ఎందుకు అదానీని వెనకేసుకొస్తున్నారు..?

ఆర్థిక నేరగాడి మీద చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. మన మార్కెట్లు బలంగా ఉన్నాయంటూ అదానీని సాక్షాత్తు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఎందుకు వెనకేసుకొచ్చారు..? బత్తాయి బ్యాచికి అండగా ఉంటూ… వాట్సాప్ యూనివర్సిటీ వ్యాసాలు వ్యాప్తి చేసే కొందరు సన్నాసులు.. అదానీని స్వాతంత్ర్య సమరయోధుడిలా.. దేశాన్ని కాపాడేందుకు పుట్టిన దేవుడిలా ఎందుకు కీర్తిస్తున్నారు..? దేశభక్తి పేరుతో కాషాయ రంగు పులుముకున్న యూట్యూబ్ ఛానళ్లు ఎందుకు అదానీకి మద్దతుగా వరుసపెట్టి కార్యక్రమాలు చేస్తున్నాయి..?

అర్షద్ మెహతా అనే ఓ ఆర్థిక నేరగాడిని అరెస్ట్ చేసి బొక్కలో తోసిన ఇదే భారతదేశంలో… తప్పుడు లెక్కలతో అనతికాలంలో ఆస్తులు ఆకాశాన్ని తాకిన అదానీని ఎందుకు అరెస్ట్ చేయరు.?పెట్టుబడిగా పెట్టిన ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల సొమ్మును మింగిస్తోంటే ప్రస్తుత సర్కారు ఎందుకు స్పందించడం లేదు.? చర్యల సంగతి దేవుడెరుగు..? కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు. పైగా హిండెన్ బర్గ్ సంస్థపై మూకుమ్మడిగా ఎదురుదాడి ఎందుకు..? దేశంలోని ప్రతిపక్షాలు.. ఇతర మతాలు ఏకమై బ్రిటన్ వేదికగా భారత్ పై కుట్ర చేస్తున్నాయంటూ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు..? ఏకంగా బీజేపీ మూలమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అదానీకి మద్దతుగా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చింది..?

ఎందుకంటే..?

అదానీది గుజరాత్.. మోడీదీ గుజరాత్..

ప్రపంచ ధనవంతుల లిస్ట్ లో అక్కడెక్కడో ఉన్న అదానీనిని టాప్ ప్లేస్ లోకి తీసుకొచ్చింది మోడీనే(ఇది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు).
బీజేపీకి తెరవెనక అదానీ నుంచి భారీగా ఫండ్స్ వస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. అటు బీజేపీ మాతృసంస్థ RSSకు అదానీ ఫండింగ్ ఉందనే ప్రచారముంది.

అలాంటప్పుడు.. అదానీపై చర్యలు తీసుకుంటే అతను తప్పు చేసినట్టే కదా..! అదానీ తప్పు చేశాడని చెబితే.. మోడీ తాను కూడా తప్పు చేశానని ఒప్పుకున్నట్టే కదా..! మోడీ వల్లే అదానీ ఆస్తులు పెరిగాయి కాబట్టి.. ఆ పాపంలో నూటికి నూరు శాతం మోడీకి పాలుపంపులు ఉన్నట్టే కదా.
ఈ విషయం బయటపడితే.. విశ్వగురువుగా చలామణి అవుతున్న వ్యక్తి పరువు.. కరోనా టైంలో శవాలు తేలిన గంగానది మురికి నీటిలో కలిసిపోతుంది. ఇన్ని రోజులుగా ప్రపంచానికిగొప్పగా తనను తాను చూపించుకున్న గాలి బుడగ పేలిపోతుంది. దేశానికి జరిగే నష్టం కంటే కూడా.. మోడీకి బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు, దాని వాట్సాప్ యూనివర్సిటీ పెయిడ్ బత్తాయిలకు, 24/7 మొరిగే కాషాయ మీడియాకు ఎక్కువ నష్టం జరుగుతుంది.
ఆర్ఎస్ఎస్ ఆర్థికమూలాలకు దెబ్బపడుతుంది. ఆయనకు బాకాలూదుతున్న మీడియా దుకాణం మూసుకోవాలి. బత్తాయి పెయిడ్ బ్యాచికి కూలీ దొరకదు.

అందుకే దేశాన్ని కుదిపేసే ఆర్థిక కుంభకోణం జరిగినా అసలేం జరగనట్టు కవరింగ్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం అదానీకి మద్దతుగా.. అదానీ సమస్య జాతీయ సమస్య అన్నట్టు ట్వీట్లు వేయిస్తున్నారు. ఇదీ బీజేపీ కుటిల రాజకీయం. తప్పు చేసి.. అది తమ పీకల మీదికి వచ్చిన్నాడు. దాని జాతి సమస్యగా ఎక్స్ పోజ్ చేయడం.. ప్రజలను తప్పుదారి పట్టించి తమ పబ్బం గడుపుకోవడం అలవాటుగా మారిపోయింది. మతం రంగు పూయడం, దేశం పేరు చెప్పడం, దేశభక్తి అంటూ మాయాజాలం చేసి చాపకిందనీరులా దేశాన్ని నాశనం చేస్తున్నారు. మనం వారి మాయలో పడితే.. దేశం.. దేశంతో పాటు మనం నాశనం కావడం పక్కా. ప్రజలారా మేల్కొనండి.

Also Read :