Manik Sarkar : 4 సార్లు సీఎం… మరి ఈ సారి ఎందుకు పోటీ చేయడం లేదు?
Latest National News

Manik Sarkar : 4 సార్లు సీఎం… మరి ఈ సారి ఎందుకు పోటీ చేయడం లేదు?

Manik Sarkar : ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు లెప్ట్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సారి కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకున్న లెప్ట్ ఫ్రంట్ 60 స్థానలకు 47 స్థానల్లో పోటీ చేయనుంది. 13 స్థానల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 47 స్థానల్లో 43 స్థానాల్లో సిపిఎం బరిలో దిగనుంది. సిపిఐ, ఆర్‌ఎస్‌పి, ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీలకు తలా ఒక స్థానాన్ని కేటాయించారు. ఒక ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్న పౌరహక్కుల కార్యకర్త పురుషోత్తంరారు బర్మన్‌ను లెఫ్ట్‌ ప్రంట్‌ బలపరుస్తోంది.

ధన్‌పూర్‌కే మాత్రమే పరిమితం కాకుండా

అయితే ఈ సారి ఎన్నికల్లో సిపిఎం సీనియర్ నేత, మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ పోటీ చేయడం లేదు. సిపిఎం ఆయనకు టికెట్ కూడా కేటాయించలేదు. త్రిపుర రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా పనిచేసిన 74 ఏళ్ల మాణిక్‌ సర్కార్‌(Manik Sarkar) ఈ సారి పోటీ చేయకపోవడం పట్ల సిపిఎం వర్గాలు స్పందించాయి. మాణిక్‌ సర్కార్‌ కేవలం తన నియోజకవర్గమైన ధన్‌పూర్‌కే మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాల్సి ఉందని సిపిఎం వర్గాలు తెలిపాయి.

వచ్చే జీతాన్ని కూడా పార్టీకే

1998 నుండి 2018 వరకు త్రిపుర సీఎంగా పనిచేసిన మాణిక్‌ సర్కార్‌ ఇండియాలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సృష్టించారు. మాణిక్ సర్కార్ పంచాలి భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు. మాణిక్ సర్కార్ తనకు వచ్చే జీతాన్ని కూడా తన పార్టీకి విరాళంగా ఇస్తారు, ప్రతిగా పార్టీ నుండి జీవనభృతి పొందుతున్నారు. కనీసం ఆయనకు సొంతంగా ఇళ్లు, కారు కూడా లేదు. ఇప్పటివరకు దేశంలో సీఎంగా పనిచేసిన వారందరిలోకి అత్యంత పేదవారిగా మాణిక్ సర్కార్ మిగిలారు.

Also Read :