Nupur Sharma : ఈ నూపుర్ శర్మ ఎవరు? బ్యాక్‌‌గ్రౌండ్ ఏంటి?
Latest National News

Nupur Sharma : ఈ నూపుర్ శర్మ ఎవరు? బ్యాక్‌‌గ్రౌండ్ ఏంటి?

Nupur Sharma : మొన్నటివరకు ఎవరికి పెద్దగా తెలియని పేరు నూపుర్ శ‌ర్మ ..కానీ ఇప్పుడీమే హట్ టాపిక్ అయ్యారు. ఓ టీవీ ఛానల్ లో డిబెట్ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా పలు చోట్లల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆమె పైన పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా నమోదయ్యాయి. దీనితో బీజేపీ హైకమాండ్ అమెను ఆరేళ్ళ పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతా హాట్ టాపిక్ గా మారిన నుపూర్ శర్మ(Nupur Sharma) ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Nupur Sharma: The Indian woman behind offensive Prophet Muhammad comments -  BBC News

37 ఏళ్ల నూపుర్ శర్మ 1985లో న్యూఢిల్లీలో జన్మించారు. వృత్తిరీత్యా ఆమె ఓ లాయర్.. మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆమె చదివారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఆమె… 2011లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుంచి LLM పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే ఆమె రాజకీయాల్లోకి ఉన్నారు. జూలై 2009 నుండి జూన్ 2010 వరకు టీచ్ ఫర్ ఇండియాకు అంబాసిడర్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్‌పై 2015 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి 31,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Who is Nupur Sharma? DUSU ex-president & LSE alum now suspended by BJP for  remarks on Prophet

ఆ తర్వాత మనోజ్ తివారీ నేతృత్వంలోని బీజేపీ ఢిల్లీ విభాగానికి అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. 2020లో J.P నడ్డా అధ్యక్షతన ఆమె బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. న్యాయపరమైన చతురత, జాతీయ సమస్యలపై మంచి పరిజ్ఞానం, పలు బాషల పైన పట్టు ఉండడంతో ఆమెను తరచుగా జాతీయ సమస్యలపై టీవీ చర్చలకు పార్టీ నాయకులు అమెను పంపేవారు.

The rise and fall of Nupur Sharma | Deccan Herald

26 మే 2022న, టైమ్స్ నౌ టెలివిజన్ ఛానెల్‌లో జ్ఞాన్వాపి మసీదు వివాదంపై జరిగిన చర్చలో నూపుర్ పాల్గొంది, ఆ సమయంలో ముహమ్మద్ ప్రవక్త, అతని మూడో భార్య ఆయిషా.. వారి వివాహం జరిగిన సమయంలో వారి వయస్సు గురించి అమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నూపుర్ వ్యాఖ్యలకు నిరసనగా కాన్పూర్‌లో ఒక ముస్లిం సంస్థ బంద్‌కు పిలుపునిచ్చింది, ఈ సందర్భంగా హింస చెలరేగడంతో 40 మంది వరకు గాయపడ్డారు.

Nupur Sharma Prophet Mohammad Remark: BJP Suspends Spokesperson First  Reaction

కాగా పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం నూపుర్ శర్మ క్షమాపణలు చేప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లుగా అమె ట్వీట్ చేశారు.

Also Read :