Aam Aadmi Party : తోపు, తురుమ్ అంతే.. సీఎంనే ఓడించిన మొబైల్ మెకానిక్..!
Latest National News

Aam Aadmi Party : తోపు, తురుమ్ అంతే.. సీఎంనే ఓడించిన మొబైల్ మెకానిక్..!

Aam Aadmi Party : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలనం సృష్టించింది.. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే మిగతా పార్టీలను ఊడ్చిపారేసింది.. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌‌లో ఆప్ ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆప్‌ అభ్యర్ధుల చేతిలో హేమాహేమీలు ఓడిపోవడం గమనార్హం .

పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్‌జిత్ సింగ్ పోటీ చేసిన రెండు చోట్లల్లో ఓడిపోయాడు.. చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ స్థానాలలో ఆప్‌ అభ్యర్ధుల చేతిలో ఓటమిని చవి చూశారు చన్నీ.. అయితే బదౌర్‌లో చన్నీని ఓడించింది ఎవరో తెలుసా.. మొబైల్ రిపేర్ షాపులో పనిచేసే ఆప్ అభ్యర్ధి లబ్‌‌ సింగ్ ఉగోకే.

May be an image of 5 people, people standing, turban and indoor

ఇప్పుడు ఇతని గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. 35 ఏళ్ల లబ్‌‌సింగ్ ఉగోకే 1987లో పుట్టాడు.. 12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ రిపేర్‌లో డిప్లొమా కోర్సును నేర్చుకున్నాడు. ఆయన తండ్రి డ్రైవర్ కాగా, అతని తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌‌గా పనిచేస్తోంది.

2013లో ఉగోకే స్వచ్ఛందంగా ఆప్‌లో చేరిన లబ్‌‌ సింగ్ ఉగోకేకి ఇప్పుడు పోటీ చేసే అవకాశం వచ్చింది.. అది కూడా సీఎం చన్నీ పైన.. అయినప్పటికీ ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోలేదు.. గెలుస్తానన్న నమ్మకాన్ని వదులుకోలేదు.. ఫైనల్ గా చన్నీపై 37,558 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.

May be an image of 6 people, people standing and outdoors

ఇక 2017లో బదౌర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా గెలుపొందారు. అయితే, ధౌలా గతేడాది కాంగ్రెస్‌లో చేరారు. ఈ సారి అక్కడినుంచి పోటీ చేసే అవకాశం లబ్‌‌సింగ్ ఉగోకే దక్కింది.

Also Read :