New Farm laws :  చట్టాల రద్దు వెనుక మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Latest National News

New Farm laws : చట్టాల రద్దు వెనుక మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?

New Farm laws : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, ప్రజాస్వామ్య విజయం.. నూతన వ్యవసాయ చట్టాలను (New Farm law)  రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం, మన దేశ ప్రజాస్వామ్యం సాధించిన విజయం.

పట్టువదలని పోరాటం సాగించిన పంజాబ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాల రైతులకు అభినందనలు.

“రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏమైనా చేస్తారు..అది మంచి అయినా సరే, చెడు అయినా సరే” అనేది మరొక్కసారి రుజువు అయింది.

పంజాబ్ ఎన్నికల్లో ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉండడం, బీజేపీకి నాలుగో స్థానానికో ఐదో స్థానానికో పడిపోయే స్థితి ఉండడం; ఈ చట్టాల ప్రభావం ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద కూడా ఉంటుంది అనే భయం ఇవన్నీ కలిసి మోడీని వెనుకడుగు వేయించాయి. ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్‌‌తో, అమరీందర్ సింగ్ కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని బలమైన శక్తిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇక వ్యవసాయ చట్టాల విషయానికి వస్తే , ఇవి కాగితాలపై బాగానే ఉన్నప్పటికీ, కళ్ళెదురుగా జరుగుతున్న పరిణామాల వల్ల, వ్యవసాయాన్ని అదానీ పరం చేసే ఎత్తుగడ గానే రైతులు ఈ చట్టాలని చూసారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఎయిర్ పోర్టులు, సీ పోర్టులను అదానీ పరం చేస్తుండడం చూస్తున్న ప్రజలకి, ఈ చట్టాల విషయంలో కూడా అదే జరుగుతుంది అనే అభిప్రాయం కలగడంలో వింత ఏమీ లేదు.

ఈ మొత్తం ప్రక్రియ వల్ల నష్టపోయేది మాత్రం భారత వ్యవసాయ రంగమే. ఎందుకంటే ఇప్పట్లో ఇక ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయంలో సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచన కూడా చేయదు. దీనివల్ల, వ్యవసాయ రంగం నష్టాల భారాన్ని ఇతర రంగాలు మోయక తప్పదు. మొత్తంగా దేశ ఆర్ధిక ప్రగతికి ఇది పెద్ద ఎదురుదెబ్బ.

Naresh Siramani

Also Read :