Vote From Home : దేశంలో తొలిసారిగా Vote From Home అనే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది. కర్ణాటక ఎన్నికల ద్వారా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఒకవేళ ఇది ఇతర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులకు ఇంటి నుండి ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పిస్తుంది. ఈసీ నిర్ణయంతో కర్ణాటకలో 80 సంవత్సరాలు పై బడిన వారు 12.15 లక్షల మంది, 5 లక్షల 55 వేల మంది దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించనున్నారు.
అయితే ఇంటి నుంచి ఓటు ఎలా వేయాలి ? దీనికి సంబంధించిన ఈసీ రూల్స్ ఏంటీ ఒకసారి తెలుసుకుందాం. 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు పోలింగ్ కు ఐదు రోజుల ముందే ఫారం 12 D కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ఈసీ ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేసుకున్న వారు ఓట్ ఫ్రమ్ హోమ్ కు అర్హులా కాదా అన్నది నిర్థారిస్తారు. ఆ తర్వాత పోలింగ్ జరిగే రోజు ముందు ఫారం 12D తీసుకుని.. ఎన్నికల సిబ్బంది వారి ఇంటికే వెళ్తారు. బ్యాలెట్ పేపర్ వారికి ఇచ్చి ఓటు వేయిస్తారు. ఓటు వేసే సమయంలో పక్కన ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో కూడా సైతం తీస్తారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. అయితే వారు ఎవరికి ఓటు వేశారన్నది మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓట్ ఫ్రమ్ హోమ్ కు దరఖాస్తు చేసుకున్న వారి మొత్తం లిస్టును ఈసీ అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా అందిస్తుంది.
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా, దాదాపు పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారు. కర్ణాటకలో జనవరి 2 నుంచి ఏప్రిల్ 1, 2023 మధ్య 18 ఏళ్లు నిండిన 41,000 మంది యువకులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో 9 లక్షల మందికి పైగా తొలిసారి ఓటు వేయనున్నారు.
Also Read :