UPI Transactions : ప్రపంచం డిజిటలైజేషన్ లో పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే నడిచిపోతోంది. ఏదైనా కొనాలన్నా.. ఎవరికైనా డబ్బులు పంపాలన్నా అంతా ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆన్లైన్ చెల్లింపులు (UPI Transactions) ఈ కాలంలో మరి ఎక్కువగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తో క్షణాల్లో ఎంత మొత్తం అయినా సరే పంపించే వీలు ఏర్పడింది. యూపీఐ పేమెంట్స్ విధానం బ్యాంకింగ్ రంగంలో సంచలనం అనే చెప్పాలి. భారీ భారీ షాపింగ్ మాల్స్ నుంచి రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ల వరకు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు స్వీకరిస్తున్నారు.
ఇలాంటి టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. ఇన్ని రోజులు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎంత సంతోషంగా చేశారో ఇప్పుడు ఈ వార్త విని చాలామంది అదేస్థాయిలో కన్ఫ్యూషన్ లో పడిపోయారు. ఇకపై అంటే ఏప్రిల్ ఒకటి నుంచి చార్జీలు వసూలు చేయనున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటివరకు ఫ్రీగా ట్రాన్సాక్షన్స్ అవకాశం ఉండడంతో ఇష్టారాజ్యంగా వాడి సార్ ఇప్పుడు కేంద్రం కొత్తగా చార్జీలు అంటూ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అసలు 2000 రూపాయల పరిమితి అనేది ఏ రకంగా లెక్కిస్తారు?
ఒక రోజులో ఒక వ్యక్తికి 2000 రూపాయలు పంపితే చార్జీలు వేస్తారా? లేకపోతే ఒక నెలలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని రెండువేల దాటితే చార్జీలు వసూలు చేస్తారా .. ? అనే కన్ఫ్యూజన్ ప్రజల్లో కొనసాగుతోంది. అయితే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ రికమండేషన్స్ ప్రకారం ఒక ట్రాన్సాక్షన్ రూ. 2000 దాటితే దానిపై ఒకటి పాయింట్ ఒకటి శాతం చార్జీలు వసూలు చేస్తారు. అలా ఒక రోజులో రూ. 2000 మించి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే అన్నింటిపై ఒకటి పాయింట్ ఒకటి శాతం చార్జీ చెల్లించాల్సిందే అన్నమాట. అయితే ఇప్పటివరకు కేంద్రం చెప్పిన ప్రకారం ఒక ట్రాన్సాక్షన్ కు రూ. 2000 నుంచి మీంచితేనే చార్జీలు వసూలు చేస్తారు. ఒక రోజులో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కలిపితే 2000 దాటితే దానిపై ఎలాంటి ఛార్జీలు లేనట్టుగా తెలుస్తోంది.
అంటే ఒక ట్రాన్సాక్షన్ లో పదివేల రూపాయలు చేస్తే 110 రూపాయలు చార్జీ రూపంలో వదిలించుకోవాల్సిందే. ఈ లెక్కన అమౌంట్ పెరిగే కొద్దీ చార్జీల భారం కూడా పెరుగుతూ పోతుంది.అదనపు ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ జారీ చేసేవారు రెమిటర్ బ్యాంక్‌కు వాలెట్-లోడింగ్ సర్వీస్ ఛార్జ్‌గా సుమారు 15 బేసిస్ పాయింట్లను చెల్లించాల్సి ఉంటుంది.బ్యాంక్ ఖాతా, పీపీఐ వాలెట్ మధ్య పీర్-టు-పీర్ (P2P) లేదా పీర్-టు-పీర్-మర్చంట్ (P2PM) లావాదేవీలపరంగా ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే చార్జీలు మరి ఎక్కువగా ఉండటంతో యూపీఐ చెల్లింపులు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.
Also Read : \