Yogi Adityanath : నిన్న (శుక్రవారం)ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మృతి చెందారు. అయితే ఈ ఘటనలో నలుగురు సైనికులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారున్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలిపారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). మృతులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.
అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారి జిల్లాల్లోని రోడ్లకు వారి పేర్లు పెడతామని ప్రకటించారు. ఈ మేరకు సీఎంవో నుండి జీవో రిలీజ్ అయింది.చనిపోయిన జవాన్ల పేర్లు లోకేష్ కుమార్, శ్యామ్ సింగ్ యాదవ్, భూపేంద్ర సింగ్, చరణ్ సింగ్ . అటు ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని మోడీ నిన్న ప్రకటించారు.