Uddhav Thackery : రాముడు పుట్టకపోయి ఉంటే..?
Latest National

Uddhav Thackery : రాముడు పుట్టకపోయి ఉంటే..?

Uddhav Thackery on Lord Rama : దేశంలో బీజేపీ బలపడటానికి ప్రధాన కారణం హిందూత్వ ఎజెండానే అనేది బహిరంగ రహస్యం. ఇతర మతాలపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన చాలామంది బీజేపీ నేతలను మనం చూశాం.

ఎన్నికలొచ్చిన ప్రతీసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతం పేరుతో రాజకీయాలు, మరీ ముఖ్యంగా పుణ్యపురుషుడైన రాముడి పేరును వాడుకోవడం బీజేపీకి అలవాటైన పని.

గతం, వర్తమానం ఏది చూసినా బీజేపీ ఎన్నికల ప్రచారంలో, ప్రతీ సభలో రాముడి పేరు వినబడుతుంది. అయితే ఇదే అంశంపై ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackery).

అసలు రాముడి పుట్టి ఉండకపోతే బీజేపీ వాళ్లు ఎన్నికల్లో రాజకీయాల కోసం ఏ అంశాన్ని వాడుకునేవారు..? ఎలా అధికారంలోకి వచ్చేవాళ్లని ప్రశ్నించారు. హిందూత్వానికి తామే టేకేదార్లమని బీజేపీ క్లెయిమ్ చేసుకోవడం సరికాదన్నారు.

అసలైన హిందూత్వవాదులం తామేనని చెప్పారు థాక్రే. హిందూత్వం, కాషాయానికి కట్టుబడి పనిచేసిన తన తండ్రి బాల్ థాక్రే నుంచి బీజేపీ కాపీ కొట్టిందన్నారు.

అంతకుముందు జనసంఘ్, ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు వేరేగా ఉండేవన్నారు థాక్రే. కానీ ఇప్పుడు ప్రతీ చోట తామొక్కరమే హిందూత్వవాదులమన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Read Also :