Taliban : తగ్గేదేలే… తాలిబన్లు మరో కీలక నిర్ణయం..!
Latest National News

Taliban : తగ్గేదేలే… తాలిబన్లు మరో కీలక నిర్ణయం..!

Taliban : ఆఫ్ఘనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Taliban) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్నికలతో సంబంధం లేదని, దేశంలోని స్వతంత్ర ఎన్నికల సంఘం మరియు ఎన్నికల ఫిర్యాదు కమిషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో వీటితో అవసరం లేదని ఒకవేళ భవిష్యత్ లో అవసరం అనిపిస్తే వాటిని ఇస్లామిక్ ఎమిరేట్ ద్వారా పునరుద్ధరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు ఎన్నికల కమిషన్‌లతో పాటుగా శాంతి మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసినట్లు తాలిబాన్ల అధికారి ఒకరు తెలిపారు.

2006లో స్థాపించబడిన IEC కమిషన్ అధ్యక్ష ఎన్నికలతో సహా అన్ని రకాల ఎన్నికల నిర్వహణ మరియు పర్యవేక్షణను తప్పనిసరి చేసింది. తాలిబాన్లు గతంలో మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దుచేశారు.

Also Read :