Swaroopanand Saraswati : స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత
Latest National News

Swaroopanand Saraswati : స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత

Swaroopanand Saraswati :    ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి (Swaroopanand Saraswati ) కన్నుమూశారు. ప్రస్తుతం99ఏళ్ల వయసున్న ఆయన మధ్యప్రదేశ్​లోని నార్సింగ్‌పూర్​లోని పీఠంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో పరమావిధించారు. ఏడాది కాలంగా స్వరూపానంద స్వామి ఆరోగ్యం బాగుడడం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు.

స్వరూపానంద 1924లో మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని దిఘోరి గ్రామంలో పోతిరామ్ ఉపాధ్యాయ్‌గా జన్మించారు. 9 సంవత్సరాల వయసున్నప్పుడు తన ఇంటిని విడిచిపెట్టి మత ప్రచారాలు మొదలుపెట్టారు. అతను స్వాతంత్ర్య పోరాటంలో జైలు శిక్ష అనుభవించాడు.

స్వరూపానంద (Swaroopanand Saraswati ) స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. 1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. ఇటీవల స్వరూపానంద 99వ జయంతిని జరుపుకున్నారు.

Also Read :