Uttar pradesh : ఎవరీ మౌర్య ? యోగికి షాకిచ్చిన మంత్రి.. మరో నాలుగు వికెట్లు ఢమాల్..!
Latest National News

Uttar pradesh : ఎవరీ మౌర్య ? యోగికి షాకిచ్చిన మంత్రి.. మరో నాలుగు వికెట్లు ఢమాల్..!

Uttar pradesh : త్వరలో యూపీ(Uttar pradesh) ఎలక్షన్స్ జరగనున్నాయి.. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీ దీనిని పెద్ద సవాల్ గా తీసుకొంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.. ఆ పార్టీలోని కీలక నేత, కార్మిక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను గవర్నర్ ఆనందిబెన్‌కు లేఖ రాశారు.ఆయన త్వరలో సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ త్వరలోనే ఆయన ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రసాద్‌ మౌర్య రాజీనామా చేసిన తర్వాత నేరుగా సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను కలుసుకున్నారు. అక్కడ అఖిలేష్ తో ఫోటోలు దిగారు.

ఇంతకీ ఎవరీ మౌర్య.. ?

అత్యంత శక్తిమంతమైన ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) నాయకుడు ఇతను… కుషావా వర్గాల్లో ఆయనకీ మంచి పట్టుంది. మొత్తం ఇప్పటివరకు అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారాయన.. బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు BSP అధినేత్రి మాయావతికి అత్యంత సన్నిహితుడు మౌర్య.

BSP ప్రభుత్వంలో – 1997, 2002 మరియు 2007లలో మంత్రిగా పనిచేశారు. BSP అధికారంలో లేనప్పుడు ప్రతిసారీ ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశారు. అంతేకాకుండా BSP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. పార్టీలో నెంబర్ 2 గా ఆయన అప్పుడు చలామణి అయ్యారు.

అయితే 2016లో పార్టీలో టిక్కెట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత సమాజంలోని బలహీన వర్గాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పనికి తాను ఆకర్షితుడయ్యానని మౌర్య 2017 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు .

ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీలో సమావేౖశమెన వేళ లక్నోలో మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆయన వెంట మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీని వీడడానికి సిద్దంగా ఉన్నారు.

Also Read :