Smriti irani : కేంద్రమంత్రికి చెంపదెబ్బ.. జ్ఞానోదయం అయ్యిందని సమాదానం
Latest National

Smriti irani : కేంద్రమంత్రికి చెంపదెబ్బ.. జ్ఞానోదయం అయ్యిందని సమాదానం

Smriti irani post on her childhood : కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని(Smriti irani) సోషల్ మీడియలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. 80వ దశకంలో పిల్లలను తల్లిదండ్రులు ఎలా క్రమశిక్షణలో పెట్టారో వివరిస్తూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.

చిన్న తనంలో తనను తల్లిదండ్రులు సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లలేదని.. తన తల్లి ఒక్క దెబ్బ కొట్టడంతో అంతా సెట్ అయ్యిందని ఇన్ స్టాగ్రామ్(instagram) లో పోస్ట్ చేశారు. తల్లి కొట్టిన దెబ్బతో తన జ్ఞాననేత్రం తెరుకుందని రాశారు. ఆ ఒక్క దెబ్బ తన ఆలోచనలు, పనులు మార్చేసిందని స్మృతి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :

తన అనుభవాన్ని వివరించిన స్మృతి ఇరానీ(Smriti irani).. ఇలాంటి అనుబవాలు ఉన్నవారు తమ జ్ఞాపకాలను పంచుకోవాలని కోరారు.

కేంద్రమంత్రి పోస్ట్ కు నెటిజన్లు భారీగానే స్పందించారు. బాటా చెప్పుతో తన తిక్క కుదిరిందని ఒకరు చెప్పగా.. తనకూ ఆ అనుభవం ఉందని రిప్లై ఇచ్చారు ఇరానీ.

సినీ, సీరియస్ నటి అయిన స్మృతి ఇరానీ.. మోడీ గవర్నమెంట్ లో కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. పలు తెలుగు సినిమాల్లోనూ ఆమె కనిపించారు.

smriti irani

ఇవి కూడా చదవండి :