Chhattisgarh : ఛత్తీస్గడ్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మావోయిస్టులు దాడిలో ప్రాణాలు కోల్పోయిన మార్కం అనే జవాన్ అంత్యక్రియల్లో అతని భార్య సతీసహగమనానికి ప్రయత్నించింది. భర్త చితిపై పడి తనను కూడా తీసుకెళ్లూ అంటూ గుండెలవిసేలా రోధించింది.
నా భర్త లేనప్పుడు, నేను జీవించడానికి కారణం లేదు. నా భర్త నిప్పుల్లో కాలిపోతుంటే చూడలేనని గుండె పగిలేలా విలపించింది. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరిని కలిచివేసింది. అనంతరం గ్రామస్తులు అమరవీరుడి భార్యను ఓదార్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఛత్తీస్గడ్లో ఇటీవల మావోయిస్టులు దాడిలో 10 మంది సైనికులు మృతి చెందారు. వారి మృతదేహాలు సొంతగ్రామానికి చేరుకుంటున్నాయి. అధికారల లాంఛనాలతో సైనికుల అంత్యక్రియలు జరిగాయి. వీరజవాన్ కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.