Ramdev : నోరు మూసుకో.. మళ్లీ అడగకు… జర్నలిస్ట్ పై రెచ్చిపోయిన రామ్ దేవ్ బాబా..!
Latest National News

Ramdev : నోరు మూసుకో.. మళ్లీ అడగకు… జర్నలిస్ట్ పై రెచ్చిపోయిన రామ్ దేవ్ బాబా..!

Ramdev : యోగా గురువు రామ్ దేవ్ బాబా అసహనం కోల్పోయారు.. ఏకంగా జర్నలిస్ట్ పైకే బెదిరింపులకి దిగాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిదంటే.. రామ్ దేవ్(Ramdev) బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ రామ్ దేవ్ బాబా గతంలో చేసిన కామెంట్స్ పైన ప్రశ్నలు అడిగాడు.. దీనితో సహనం కోల్పోయిన ఆయన… లైవ్ అన్న విషయం మరిచిపోయి బెదిరించారు. 2014లో బాబా రామ్‌ దేవ్‌ ప్రజలు లీటర్‌కు రూ. 40 పెట్రోల్‌, రూ. 300 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.

ప్రస్తుతం ఈ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో రామ్ దేవ్ బాబాని ప్రశ్నించారు సదరు జర్నలిస్ట్… దీనిపైన రామ్ దేవ్ బాబా స్పందిస్తూ.. ‘‘ అవును.. నేను గతంలో ఆ మాట అన్నాను.. ఇప్పుడు నువ్వేం చేస్తావు ? నోరు మూసుకో.. మళ్లీ అడగకు.. ఇలా మాట్లాడకు.. మంచిది కాదు.. నువ్వు మీ పేరెంట్స్‌కు మంచి కొడుకుగా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఆ తర్వాత మాట్లాడిన రామ్ దేవ్ బాబా.. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని, దేశాన్ని ఎలా నడుపుతారని, జీతాలు చెల్లిస్తారని, రోడ్లు వేస్తారని ప్రభుత్వం చెబుతోందని కామెంట్స్ చేశారు.. అవును.. ద్రవ్యోల్బణం తగ్గాలి.. అందుకు అంగీకరిస్తున్నాను.

అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలని అన్నారు.. తాను తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తానని రామ్‌దేవ్ అన్నారు. కాగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు గత 10రోజుల్లో తొమ్మిది రోజులు పెరిగాయి.. ఇవ్వాళ లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ. 80 పైసలు పెరిగింది.

Also Read :