Love Marriage : ప్రేమ, పెళ్లని చెప్పి కొంప కొల్లేరు చేసింది.. జీవితం నాశనం..!
Latest National News

Love Marriage : ప్రేమ, పెళ్లని చెప్పి కొంప కొల్లేరు చేసింది.. జీవితం నాశనం..!

Love Marriage : 45 ఏళ్ల ఓ వ్యక్తి 25 ఏళ్ల ఓ అమ్మాయిని ఆ మధ్య ప్రేమ పెళ్లి(Love Marriage) చేసుకున్న సంగతి తెలిసిందే.. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. అయితే ఎంతో అనోన్యంగా ఉంటారనుకున్న ఈ జంట విషయంలో విషాదం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 45 ఏళ్ల శంకరప్పకి పెళ్లి కాలేదు.. అతనికి ఓ అమ్మ ఉంది.

అతను వ్యవసాయం చేస్తుండేవాడు.. ఇక అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయిన 25 ఏళ్ల మేఘనకు శంకరప్ప పరిచయం అయ్యాడు.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. ముందుగా ప్రేమ, పెళ్లి ప్రస్తావన మేఘనే.. శంకరప్ప దగ్గరికి తీసుకొచ్చింది. దీనితో స్థానికంగా ఓ గుళ్ళో వీరిద్దరూ గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు.

అయితే భర్త శంకరప్పకి సంబంధించిన రెండు కోట్ల విలువ కలిగిన భూమి పైన మేఘనకి కన్నుపడింది. దానిని అమ్మేసి బెంగుళూరు వెళ్దామని శంకరప్పతో రోజు వాదించేది మేఘన.. అయితే దీనికి శంకరప్ప తల్లి ఒప్పుకోకపోవడంతో కుటుంబంలో తరుచు గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో శంకరప్ప తన పొలం వద్ద ఓ చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకుండా చివరి వరకు ఉన్న శంకరప్ప సంతోషంగా ఉండేవాడని ప్రేమ, పెళ్లి అని చెప్పి శంకరప్ప జీవితాన్ని మేఘన నాశనం చేసిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

Also Read :