Sameer wankhede : రియల్ లైఫ్ సింగం.. బాలీవుడ్ నే సుస్సు పోయిస్తున్నాడు..!
Latest National

Sameer wankhede : రియల్ లైఫ్ సింగం.. బాలీవుడ్ నే సుస్సు పోయిస్తున్నాడు..!

Sameer wankhede real life singam : బాలీవుడ్ లో ఇప్పుడో హాట్ టాపిక్ పై చర్చ నడుస్తోంది. అదే డ్రగ్స్ ఇష్యూ. షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్టుతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సెలబ్రిటీలంతా షారూక్ ఇంటికి క్యూ కట్టారు. అతడికి అండగా ఉన్నామని చెబుతున్నారు.

రెండు రోజుల్లో బాలీవుడ్ కు చుక్కలు చూపించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే. ఆయన ముంబైలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డ్రగ్స్ సప్లయర్లు, డ్రగ్స్ అలవాటు ఉన్న సెలబ్రిటీలు వణికిపోతున్నారు. రెండేళ్లలో దాదాపు 17 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు సమీర్.

బాలీవుడ్ ను వణికిస్తున్న సమీర్ వాంఖడే పుట్టింది ముంబైలోనే. సమీర్ తండ్రి కూడా పోలీసు ఆఫీసరే. సమీర్ 2008 బ్యాచ్‌ కు చెందిన IRS అధికారి. అనేక ప్రాంతాలు పలు కీలక హోదాల్లో పనిచేశారు. ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ డిప్యూటీ కమిషనర్‌, NIA అదనపు ఎస్పీ, DRI జాయింట్‌ కమిషనర్‌ గా పనిచేశారు.

చాలా శాఖల్లో పనిచేసిన ఆయన చివరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో చేరారు. ముంబై జోన్ కు డైరెక్టర్ గా ఉన్నారు. NCBలో చేరాక డ్రగ్ డీలర్లపై యాక్షన్ మొదలెట్టారు. సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మరణంతో సంబంధమున్న డ్రగ్స్‌ కేసును ఈయనే బయటకు తీసుకొచ్చారు. నటి రియా చక్రవర్తిని స్వయంగా ఇంటరాగేట్ చేశారు.

2010లో సమీర్(Sameer wankhede )మహారాష్ట్ర సర్వీస్‌ టాక్స్‌ విభాగంలో పనిచేశారు. అప్పుడు ట్యాక్స్ లు ఎగ్గొట్టిన 2500 మందిపై కేసు పెట్టారు. వీరిలో 200 మంది సెలబ్రిటీలున్నారు. రెండేళ్లలో ఖజానాకు రూ.87కోట్లు తీసుకొచ్చారు.

ఎవడైతే నాకేంటీ..?

కస్టమ్స్‌ లో పనిచేసినప్పుడు తన కఠిన నిర్ణయాలతో చుక్కులు చూపించారు. సెలబ్రిటీలు విదేశాల నుంచి తెచ్చుకునే వస్తువులను ఆయన వదల్లేదు. ట్యాక్స్ కట్టకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ క్లియరెన్స్ ఇచ్చేవారు కాదు.

2013లో ఫారెన్ కరెన్సీతో వస్తున్న సింగర్‌ మికా సింగ్‌ ను అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. పన్ను ఎగవేసిన కేసుల్లో అనురాగ్ కశ్యప్‌, వివేక్‌ ఒబెరాయ్‌, రామ్‌ గోపాల్ వర్మతో పాటు చాలా మంది ఇళ్లలో సోదాలు కూడా చేశారు.

సమీర్ వాంఖడేకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగని రూల్స్ బ్రేక్ చేస్తామంటే మాత్రం ఒప్పుకోరు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచి ముంబై ఎయిర్ పోర్టు చేరుకుంది. అయితే.. ఆటగాళ్లను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు సమీర్. ట్రోఫీకి సంబంధించిన బంగారానికి ట్యాక్స్ కట్టాక గానీ వారిని బయటకు వదల్లేదు.

సినీ ఫక్కీలో ఆపరేషన్..

ఆయన ఆపరేషన్స్ అన్నీ సినీ ఫక్కీలోనే ఉంటాయి. ఎవరికీ అనుమానం రాకుండా.. అవసరమైతే కస్టమర్ల మాదిరిగా వెళ్లి నిందితులను పట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కార్డెలియో క్రూయిజ్ లోకి కూడా అలాగే వెళ్లారు సమీర్ వాంఖడే.

ఓ ప్రయాణికుడి మాదిరిగా వెళ్లారు. పార్టీ మొదలయ్యే వరకు అందరితో కలిసిపోయి అనుమానం రాకుండా ఉన్నారు. పార్టీ మొదలై డ్రగ్స్ వాడుతున్నారని స్మెల్ రాగానే.. చార్జ్ మొదలుపెట్టారు. షారూక్ ఖాన్ కుమారుడితో సహా 9 మందిని అరెస్ట్ చేశారు.

Read Also :