Modi Dress In Kedarnath : మోడీ వేసుకున్న ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటి?
Latest National News

Modi Dress In Kedarnath : మోడీ వేసుకున్న ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటి?

Modi Dress In Kedarnath : ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా అక్కడి సంప్రదాయ దుస్తుల్లో కనిపించాడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నిన్న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ (Modi Dress In Kedarnath )ఆలయాన్ని సందర్శించిన మోడీ ఆక్కడ ప్రత్యే్కంగా ప్రార్థనలు చేశారు. అయితే ఈ పర్యటనలో మోడీ వేసుకున్న డ్రెస్ అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఈ డ్రెస్ వెనుకున్న స్పెషాలిటీ ఉంది.

Modi Dress In Kedarnath : ఏంటా డ్రెస్.. ఏంటా స్పెషాలిటీ

మోడీ వేసుకున్న ఈ డ్రెస్ ను చోళ డోరా(Chola Dora) అని పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ వస్త్రధారణ. ఇటీవల అక్కడికి వెళ్లిన మోడీకి ఓ మహిళ ఆయనకు స్వయంగా దీనిని బహుకరించింది. దీనిని ఆమెనే తన స్వహస్తాలతో తయారుచేసింది. ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఆ దుస్తులను ధరిస్తానని మోడీ ఆమెకు హామీ ఇచ్చారు. అలా నిన్న కేదార్‌నాథ్ పర్యటనలో మోడీ దీనిని ధరించారు. చోళ డోరా దుస్తులను శీతల ప్రాంత గొర్రెల ఉన్ని నుంచి తయారు చేస్తారు.చలి నుంచి ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 10 నుండి 25 మీటర్ల పొడవు ఉండే ఈ చోళ డోరా సుమారుగా 25 కిలోల బరువు ఉంటుంది.

కేదార్‌నాథ్‌లో పూజల అనంతరం ప్రధాని మోడీ బద్రీనాథ్‌ను సందర్శించనున్నారు. ఉత్తరాఖండ్‌లో రూ. 3400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. గౌరీకుండ్‌ను కేదార్‌నాథ్‌తో కలిపే రోప్‌వేకు శంకుస్థాపన చేశారు. కేదార్‌నాథ్ రోప్‌వే దాదాపు 9.7 కి.మీ పొడవు ఉంటుంది. ఇది గౌరీకుండ్‌ను కేదార్‌నాథ్‌తో కలుపుతుంది.

Also Read :