PM Modi’s Auction Offer: అన్నీ అమ్మేద్దాం.. డబ్బులొస్తాయ్..! మోడీ ప్లాన్ అదుర్స్..!
Latest National

PM Modi’s Auction Offer: అన్నీ అమ్మేద్దాం.. డబ్బులొస్తాయ్..! మోడీ ప్లాన్ అదుర్స్..!

PM Modi’s Auction Offer: ఒలింపిక్స్ లో పాల్గొని ఇటీవల భారత్ కు వచ్చిన ఆటగాళ్లను ప్రధాని మోడీ కలిశారు. వాళ్లతో కలిసి భోజనం చేశారు. ఒలింపిక్స్ కు వెళ్లకముందు కూడా ఆటగాళ్లతో సమావేశమై.. వారిలో ఉత్సాహం నింపారు. పతకాలతో వచ్చాక మళ్లీ కలుద్దామని.. చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నారు.

అందులో భాగంగానే ఆగస్టు 16న ఒలింపిక్స్‌ కు వెళ్లొచ్చిన అథ్లెట్స్ కు విందు ఇచ్చారు మోడీ. పతకాలు తెచ్చినవారితో పాటు.. బాగా ఆడిన వారిని పేరుపేరునా పలకరించారు.

పతకం తెస్తే సింధుకు ఐస్ క్రీం తినిపిస్తానని చెప్పిన మోడీ.. తన మాట నిలబెట్టుకున్నారు. అలాగే నీరజ్ చోప్రాకు చుర్మా కూడా తినిపించారు.

ఈ సందర్భంగా.. ఓ ఆసక్తికరమైన అంశం చర్చకు వచ్చిందట. నీరజ్ వాడిన జావెలిన్, సింధు రాకెట్, లవ్లీనా బాక్సింగ్ గ్లోవ్స్.. వేలం వేద్దామని ఓ ప్రతిపాదన పెట్టారట మోడీ. వేలం వేస్తే(PM Modi’s Auction Offer) ఇబ్బందేం లేదు కదా అని.. క్రీడారులతో మోడీ అన్నట్టు తెలుస్తోంది.

ప్రధాని ప్రతిపాదనకు నీరజ్, సింధు, లవ్లీనా కూడా ఓకే చెప్పారట. అలాగే.. మరికొందరు ఆటగాళ్ల వస్తువులు కూడా వేలం వేద్దామని అన్నారట మోడీ. వీటిని ఏదైనా మంచి పనికి వినియోగించవచ్చని చెప్పారట. క్రీడాకారులు, సెలబ్రిటీల వస్తువులు వేలం వేయడం చాలా కాలంగా జరుగుతున్నదే.

ఇంత వరకు బాగానే ఉన్నా.. సోషల్ మీడియా మాత్రం ఊరుకోదు కదా. దేశంలోని అన్ని ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అమ్మడం బాగా అలవాటయ్యింది. అందుకే ఇప్పుడు క్రీడాకారుల వస్తువులు అమ్మేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు.