Petrol Diesel Price Today: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. గ్యాస్ కూడా బాబోయ్..!
Latest National News

Petrol Diesel Price Today: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. గ్యాస్ కూడా బాబోయ్..!

Petrol Diesel Price Today: అయిదు నెలల విరామం తర్వాత మంగళవారం భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు(Petrol Diesel Price Today) పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 80 పైసలు పెరిగింది. దీనిలో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.21 ఉండగా, డీజిల్ లీటరు రూ. 87.47గా ఉంది.

ఢిల్లీలో పెట్రోల్ ధర గతంలో రూ.95.41గా ఉండగా ఇప్పుడు లీటరుకు రూ.96.21గా ఉంది, డీజిల్ ధరలు లీటరుకు రూ.86.67 నుంచి రూ. 87.47కి పెరిగాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 109.10 కాగా, డీజిల్ ధ‌ర రూ. 95.49గా ఉంది. అలాగే వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధర సిలిండర్‌కు రూ.50 పెరిగింది.

ఇప్పుడు 14.2 కిలోల LPG సిలిండర్ ధర రూ. 949.50. పంజాబ్‌తో సహా ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు ముందు నవంబర్ 4 నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఫ్రీజ్‌లో ఉన్నాయి. ఇక 2021 జూలై నుంచి అక్టోబరు మధ్య కాలంలో LPG ధరలు దాదాపుగా రూ. 100 వరకు పెరిగాయి.

Also Read :