Partner Swapping : ఓ రాక్షక వికృత క్రీడ.. వాళ్లంతా బాధితులా..? నిందితులా..?
Latest National

Partner Swapping : ఓ రాక్షక వికృత క్రీడ.. వాళ్లంతా బాధితులా..? నిందితులా..?

Partner Swapping gang busted in kerala : గ్లోబలైజేషన్ కారణంగా.. మనుషుల మెంటాలిటీ కూడా మారిపోతోంది. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మార్పులు వస్తే ఫర్లేదు. కానీ.. ఈ మెంటాలిటీ వికృత క్రీడకు దారితీస్తోంది. వీపరీత ఆలోచనదోరణివైపు తీసుకెళ్తోంది.

అలాంటి ఘటనే కేరళలో జరిగింది. కేరళలోనే కరుకాచల్ లో ఈ దారుణం జరిగింది. మామూలుగా అయితే ఈ వ్యవహారం బయటకొచ్చేది కాదేమో. కానీ ఓ బాధితురాలు పోలస్ స్టేషన్ కు రావడంతో వ్యవహారం మొత్తం బయటపడింది.

రెండు రోజుల క్రితం ఓ మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తాను రాసుకొచ్చిన ఓ కంప్లైంట్ కాగితాన్ని స్టేషన్ లో ఉన్న అధికారికి ఇచ్చింది. అది చదివిన పోలీస్ అధికారి షాక్ అయ్యాడు. ఇంత దారుణం జరుగుతోందా అని కాసేపు తాను చదివింది తానే నమ్మలేకపోయాడు.

ఇవి కూడా చదవండి :

కాసేపటికి తేరుకున్న ఆయన.. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ ను పిలిచి ఆ బాధితురాలితో మాట్లాడించాడు. అప్పుడు ఆ మహిళ ఒక్కో విషయం చెప్పడం ప్రారంభించింది.

తన భర్త తనను మరో వ్యక్తితో పడుకోవాలని చెప్తున్నాడని పోలీసులకు వివరించింది. చాలాసార్లు ఒత్తిడి తెచ్చాడని.. ఒప్పుకోకపోతే కొట్టాడని కూడా చెప్పింది. ఈ గొడవలో తాను గతంలో ఇలాగే వేరే వాళ్ల భార్యలతో(Partner Swapping) పడుకున్నానని తనతో చెప్పాడని వివరించింది.

సాధారణంగా వ్యభిచార వృత్తిలో కొందరు ఇలాంటి స్ట్రాటజీని వాడతారు. పెళ్లి చేసుకుని ఆ మహిళలను వ్యభిచారం రొంపిలోకి దించుతారు. కానీ ఇది అలాంటి వ్యవహారం కాదు. అంతకుమించిన వికృత క్రీడ.

బాధితురాలి దగ్గర వివరాలు సేకరించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె భర్తకు తీసుకొచ్చి తమదైన స్టైల్లో విచారించే సరికి అసలు గుట్టు బయటపడింది.

ఒకడు పక్కవాడి భార్యతో సుఖాన్ని పొందాలనుకోవడం. అలాంటి వారంతా ఒక్కచోట చేరి భార్యలను మార్చుకోవడం… ఇది తాము రెగ్యులర్ గా చేస్తామని ఒప్పుకున్నాడు. దీని వెనకాల ఓ పెద్ద గ్యాంగ్, టెలిగ్రామ్ మెస్సెంజర్ లో డీలింగ్స్ వివరాలన్నీ బయటపడ్డాయి. టెలిగ్రామ్, మెస్సెంజర్ లో సంప్రదింపులు జరిపి ఒప్పిస్తామని.. తర్వాత అమౌంట్ మాట్లాడుకుని.. ఇలాంటి పనులకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నిందితులు బయటపెట్టేశారు.

మరింత డీప్ గా ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసులు. ఒకదశలో వారే షాక్ కు గురయ్యారు. వేలాది మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని.. రెగ్యులర్ గా ఇదే వికృత క్రీడ కోసం కలుస్తుంటారని తెలిసి పోలీసులకే కళ్లు బయలర్లుగమ్మాయి. ఇందులో బాధితులెవరు..? నిందితులెవరనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ ఇష్యూతో సంబంధమున్న వేలాది మందిని వెతికే పనిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి :