Farm laws : రద్దు సరే.. 750 కుటుంబాల సంగతేంది మోడీ గారూ..?
Latest National

Farm laws : రద్దు సరే.. 750 కుటుంబాల సంగతేంది మోడీ గారూ..?

Modi on farm laws : ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయచట్టాలురద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల రద్దుపై తీర్మానం చేస్తామని చెప్పారు. చట్టాల విషయంలో రైతులకు క్షమాపణలు చెప్పారు.

ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది.

కానీ.. మోడీ సర్కారు తీసుకొచ్చింది కేవలం మూడు వ్యవసాయచట్టాలే కాదు. వాటి వల్ల 750కి పైగా కుటుంబాల్లో విషాధం నిండింది. 750 మంది తమ కుటుంబపెద్దను కోల్పోయారు.

ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలో, కుండపోత వర్షంలో, ఎండలోనూ తమ ఆందోళన కొనసాగించారు. చట్టాలు రద్దు చేయాల్సిందేనని పోరు సాగించారు.

చట్టాలు రద్దు చేయాలంటూ ర్యాలీ తీస్తున్న వారిపై యూపీలో ఓ కేంద్రమంత్రికొడుకు కారు ఎక్కించి చంపేశాడు. ఇలా.. రైతుల న్యాయమైన పోరాటాని దెబ్బతీసేందుకు కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేసింది.

అయినా రైతులు అన్నీ భరించారు. ప్రాణాలు పోతున్నా.. ఓపికతో ఉన్నారు.

మరి ఇప్పుడు చట్టాలు రద్దు చేస్తున్నామని  చెప్పిన మోడీ గారూ…

ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఏం చెప్తారు..? వారి కన్నీటిని తుడిచేందుకు ఏం చేస్తారు..? ఇంటి పెద్దను కోల్పోయిన పేద రైతు కుటుంబాలకు ఏం బతుకుబాట చూపిస్తారు..? పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా..? వారి గుండెల్లో నిండిన బాధను తీసేయగలరా..?

అనాలోచితంగా తీసుకున్న మీ నిర్ణయంతో.. రైతులను ఆగం చేశారు. ఊళ్లకే ఊర్లే విషాధంలో మునిగిపోయాయి. ఇప్పుడు వారికి అండ ఎవరు.?

మీ కార్పొరేట్ మిత్రుల కోసం చట్టాలు తెచ్చారు. ఎన్నికలున్నాయని.. రైతులు ఓటేసే పరిస్థితి లేదని చట్టాలు రద్దు చేశారు. అంటే రైతులు మీకు ఆటబొమ్మల్లా కనిపిస్తున్నారా..?

చట్టాలు రద్దు చేయడం కాదు. 750 రైతు కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి :