Modi jammu : నేలరాలిన సైనికుల శవాలను లెక్కపెట్టుకుని రా..!
Latest National

Modi jammu : నేలరాలిన సైనికుల శవాలను లెక్కపెట్టుకుని రా..!

Modi jammu kashmir tour : అయ్యా.. ఘనత వహించిన ప్రధాని మోడీ గారు…

మీరు దేశంలోనే తోపు ప్రధానమంత్రి అట(మీ పార్టోళ్లు చెప్పుకుంటరు బయట).

మీరు చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటరట(మీ పార్టీకి బాకాలూదే మీడియా చెప్తుంటది బయట).

మీరొచ్చినంక దేశ భద్రత మరింత పటిష్టమైందట(మీ దగ్గర పదవుల కోసం పడిగాపులు కాసే నేతలంటుంటరు బయట).

మీరొచ్చినంక దేశం రూపురేఖలు మారినయట(మీరే చెప్పుకుంటుంటరు ఎన్నికల మీటింగులల్ల).

ఇవన్నీ సరేగానీ.. గౌరవనీయులైన మోడీ గారు….

కొన్ని వినతులున్నాయి.. కాస్త వినండి.

జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ గారూ.. ఒక్క సారి గతంలో మీరు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోండి.

నోట్ల రద్దుతో కశ్మీర్ లో ఉగ్రవాదం అంతమౌతుందని చెప్పిన మోడీ గారూ.. రోజుకు ఎన్ని ఎన్ కౌంటర్లు జరుగుతున్నయో లెక్కేసుకురండి.

భద్రతాబలగాలకు భద్రత పెరిగిందని చెప్పుకుంటున్న మోడీ గారూ.. ఏడేళ్లలో నేలరాలిన సైనికుల శవాలను లెక్కేసుకుని రండి.

అయ్యా… మోడీ గారూ.. మీకే వింటున్నారా…!

ఆర్టికల్ 370రద్దుతో కశ్మీర్ కు స్వేచ్ఛనిచ్చామని చెప్పుకుంటున్న మోడీ గారూ.. ప్రత్యర్థి పార్టీలు, హక్కుల నేతలు ఇప్పటికీ నిర్భంధంలోనే ఎందుకున్నారో కాస్త చూసి రండి.

సైనికుల ప్రాణాలు పోతున్నాయని ఎన్నికలపుడు మొసలి కన్నీరు కార్చే మోడీ గారూ.. మీ పర్యటన ఉందనగానే సీఐఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి ఎందుకు జరిగిందో … కాస్త చెప్పరూ.

ఆర్టికల్ 370 రద్దైతే కశ్మీర్ లో పెట్టుబడుల వరద పారుతుందని చెప్పిన మోడీ గారూ.. ఆ వరద ఎందాక వచ్చిందో కాస్త చూసి రండి.

సరిహద్దు భద్రతలో నన్ను మించిన తోపు లేడని చెప్పుకునే మోడీ గారూ… కాస్త అరుణాచల్ వైపు కూడా వెళ్లి చైనా ఆక్రమించిన గ్రామాల్లో ఓ రెండు ఫొటోలు దిగిరండి.

మీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో బుల్డోజర్లు దింపుతామని చెప్పుతున్న మోడీ గారూ.. మన భూభాగంలో చైనా నిర్మించిన గ్రామాలను అవే బుల్డోజర్లతో కాస్త కూల్చేసి రాకూడదూ.

Read Also :