Biryani Free : అక్కడ బిర్యానీ ఫ్రీ… కానీ దూలతీరిపోయే కండిషన్..!
Latest National News

Biryani Free : అక్కడ బిర్యానీ ఫ్రీ… కానీ దూలతీరిపోయే కండిషన్..!

Biryani Free : మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. అయితే మేము ఫ్రీగా(Biryani Free) ఇస్తామంటూ ఓ హోటల్ ఆఫర్ పెట్టింది. ఆఫర్ ఒక్కరోజు మాత్రమే…   ఆఫర్ అదిరిపోయింది కదా అని టెంప్ట్ అవ్వొద్దు.. ఆఫర్‌‌‌తో పాటు దూలతీరిపోయే ఓ కండిషన్ కూడా పెట్టింది.

అదేంటంటే.. బిర్యానీ కావాలంటే కిలో టమాటోలు తెచ్చి ఇవ్వాలి.. ఇది షరతు.. లేదా ఇంకో ఆప్షన్ కూడా ఉంది. రెండు కేజీల బిర్యానీ కొంటే కిలో టమాటోలు ఫ్రీగా ఇస్తారట.. ఇదెక్కడో కాదు.. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో.. చెన్నై శివార్లలోని అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

అయితే ఈ ఆఫర్ వెనుక కారణం ఏంటంటే.. చెన్నైలో కిలో టమాటా ధర రూ.150పైగా ఉండడమే.. ఈ నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు తమ బిజినెస్‌‌‌‌‌ని పెంచుకునేందుకు, పబ్లిసిటీ కోసం ఈ కొత్త ఆఫర్‌ను ప్రకటించారు. దీంతో భోజన ప్రియులు బిర్యానీ కోసం ఎగబడ్డారు. విషయం ఏంటంటే అక్కడ కేజీ బిర్యానీ 100 రూపాయలే.

రెండు కేజీల బిర్యానీ కొంటే అరకిలో టమాటా ఉచితంగా అందించారు. లేకుంటే ఒక కేజీ టమాటా తీసుకువస్తే.. ఒక కేజీ బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఆఫర్ చేయడంతో జనం ఎగబడ్డారు. దీంతో అనుకున్నది సక్సెస్ అయ్యిందని షాపు యజమాని తెగ మురిసిపోయాడు.

అయితే టమాటా ధర పతనంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ఉచిత విక్రయం నిర్వహించినట్లు దుకాణం యజమాని తెలిపాడు.

Also Read :