Bank Loan : బ్యాంక్‌లో లోన్(Bank Loan ) అంటే మాములు విషయం కాదు.. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్న సరే చాలా సార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇవ్వన్ని ఉన్న సరే బ్యాంకు లోని ఉద్యోగులు పెట్టె కండిషన్స్ చిరాకు తెప్పిస్తోంది. దీనితో అసహనానికి గురవ్వడం అనేది కామన్‌గా జరుగుతుంది.
సరిగ్గా ఓ వ్యక్తి బ్యాంకులో లోన్ కోసం ట్రై చేసి అసహనానికి గురై… ఏకంగా ఏకంగా బ్యాంక్‌నే తగలబెట్టాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే.. వసీమ్ అనే వ్యక్తి లోన్ కోసం స్ధానికంగా ఉన్న ఓ బ్యాంకుని సంప్రదించాడు.
అయితే డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత అతని లోన్ దరఖాస్తును బ్యాంక్ తిరస్కరించింది. దీనితో అసహనానికి గురైన వసీమ్.. సదరు బ్యాంక్‌కు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.
నిందితుడిని అరెస్ట్ చేసి కాగినెల్లి పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 436, 477, 435 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read :
- Teacher Suicide : ఏంటమ్మా.. నువ్ చేసింది..?
- Partner Swapping : ఓ రాక్షక వికృత క్రీడ.. వాళ్లంతా బాధితులా..? నిందితులా..?
- Bangarraju : బంగార్రాజుకి ఫుల్ గ్లామర్.. ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు..!