Karnataka elections 2023 :   కర్ణాటక ఎన్నికలకు కాసేపట్లో  షెడ్యూల్
Latest National News

Karnataka elections 2023 : కర్ణాటక ఎన్నికలకు కాసేపట్లో షెడ్యూల్

Karnataka elections 2023 : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 29న భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ (Karnataka elections 2023 ) రిలీజ్ కానుంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగియనుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

అదే సమయంలో ఈ సారి విజయం ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పొత్తు కొసం కాంగ్రెస్, బీజేపీ నేతలు తమను సంప్రదిస్తు్న్నారని జేడీఎస్ నేత కుమార స్వామి చెబుతున్నారు. ఇక, కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్ధన రెడ్డి ప్రభావం ఆసక్తి కరంగా మారుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్నది చూడాలి. జేడీఎస్ కు మద్దతు ఇస్తామని గతంలో అయితే కేసీఆర్ ప్రకటించారు.

ఎలక్షన్ కమీషన్ ఈ సారి ఓట్-ఫ్రమ్-హోమ్ అనే ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, ఏదైనా వైకల్యంతో బాధపడుతున్న వారు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో ఇంటిదగ్గరి నుంచే ఓటు వేయగలరు.

Also Read :