AIMIM : బీజేపీ, మజ్లిస్ గేమ్.. బీఎస్పీ, కాంగ్రెస్ ఆటలో అరటిపండు…!
Latest National News

AIMIM : బీజేపీ, మజ్లిస్ గేమ్.. బీఎస్పీ, కాంగ్రెస్ ఆటలో అరటిపండు…!

AIMIM : యూపీలో బీజేపీ మరోసారి జెండా ఎగరేసింది. పార్టీ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ అధికారం చేజిక్కించుకుంది. సీట్లు తగ్గినప్పటికీ విన్నర్ గా నిలబడింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్(AIMIM ) బీజేపీకి లబ్ది చేకూరేలా వ్యవహరించిందన్న టాక్ నడుస్తోంది. యూపీలో 100 సీట్లల్లో పోటీ చేసిన ఏఐఎంఐఎం ముస్లిం ఓట్లను కొల్లగొట్టి ఎస్పీ, కాంగ్రెస్ ఓట్లు చీల్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏఐఎంఐఎం ఒక్క సీటు గెలవకపోయిన ఎస్పీ, కాంగ్రెస్ లకి పెద్ద దెబ్బ పడిందని, ఫైనల్ గా అది బీజేపీకి ప్లస్ అయిందన్న చర్చ వినిపిస్తోంది. తెలంగాణలో పట్టుమని పది సీట్లల్లో కూడా పోటీ చేయని మజ్లిస్ అక్కడ వంద సీట్లల్లో పోటీ చేయడం దీనికి మరింతగా బలం చేకురుతుంది. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓవైసీ పార్టీ 38 స్థానాల్లో పోటీ చేయగా, 37 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

Also Read :