Harnaaz Sandhu : ఎవరీ హర్నాజ్‌ సంధు.. ఎక్కడినుంచి వచ్చింది?
National News

Harnaaz Sandhu : ఎవరీ హర్నాజ్‌ సంధు.. ఎక్కడినుంచి వచ్చింది?

Harnaaz Sandhu : హర్నాజ్‌ సంధు .. ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్.. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో విజేతగా నిలిచి అందరిని ఆచర్యపరిచింది. దాదాపుగా ఎనబై మందితో పోటీ పడి ఆమె(Harnaaz Sandhu) విన్నర్ గా నిలవడం విశేషం.

ఇంతకీ ఎవరీ హర్నాజ్‌ సంధు.. హర్నాజ్‌ సంధు అసలు పేరు హర్నాజ్‌ కౌర్‌ సంధు..చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో పుట్టింది.. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది. చిన్నప్పటినుంచి సినిమాలలో నటించాలని ఆమె ఇంట్రెస్ట్ గా ఉండేది.

దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అలా 2017లో ‘మిస్‌ చంఢీఘర్‌’ కిరీటాన్ని గెలుచుకుంది. ఒకపక్కా మోడలింగ్‌ చేస్తూనే మరోపక్కా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. అనేక పంజాబీ చిత్రాలలో ఆమె నటించింది.

ఇప్పుడు మిస్ యూనివర్స్‌ గా నిలిచి హాట్ టాపిక్ గా మారింది. 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్‌ గా నిలిచి సుస్మితాసేన్‌, లారాదత్త తరవాత మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతిగా పేరు సంపాదించుకుంది.

Also Read :