Arvind Kejriwal : మోదీ సొంత రాష్ట్రంలో  కేజ్రీవాల్ కు ఘోర అవమానం
Latest National News

Arvind Kejriwal : మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ కు ఘోర అవమానం

Arvind Kejriwal :  ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కు ఘోర అవమానం జరిగింది. తనని డిన్నర్ కు ఆహ్వానించిన ఓ ఆటో డ్రైవర్ ఇంటికి ఆటోలో వెళ్తున్న కేజ్రీవాల్ ను గుజరాత్ పోలీసులు అడ్డుకున్నారు. వెళ్లడానికి వీల్లేదంటూ ఓవరాక్షన్ చేశారు. భద్రతా కారణాలంటూ కాసేపు సాకులు చెప్పారు.

అయితే కేజ్రీవాల్ వినకుండా వెళ్లాల్సి్ందే అని పట్టుబట్టడంతో చేసేదేం లేకా అనుమతిచ్చారు. చివరికి ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి డిన్నర్ చేశారు కేజ్రీవాల్.

ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో ఎన్నికలనుందన రెండ్రోజుల పర్యటన నిమిత్తం కేజ్రీవాల్ గుజరాత్‌ కు వచ్చారు. అహ్మదాబాద్‌లో ఆటో డ్రైవర్లతో సమావేశం అయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో తన గెలుపులో ఆటో డ్రైవర్లు పాత్ర కీలకమని, గుజరాత్‌లోనూ కూడా అదే పని చేయాలని వారిని కేజ్రీవాల్ కోరారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ నిల్చుని “నేను మీకు వీరాభిమానిని. పంజాబ్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చూశాను. నా ఇంటికి కూడా మీరు డిన్నర్‌కి వస్తారా?” అని అడిగాడు.

దానికి ఓకే చెప్పిన సీఎం…ఈ రాత్రి 8 గంటల సమయంలో వస్తానని హామీ ఇచ్చాడు. లోకల్ లీడర్లతో కలిసి అక్కడికి వెళ్తుడంగా పోలీసులు ఆయనని అడ్డుకుని కాసేపు షో చేశారు.

Also Read :